పాపం..మారుతి ప్రెజెంట్స్ అని వేసినా కూడా గ్రీన్ సిగ్నల్ సినిమాను కొనేవాళ్లు కరువయ్యారని వినికిడి. మూడు కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా ఇప్పుడు నిర్మాతకు బిపీ పెంచుతోంది. థియేటర్లు వెదుక్కుని, ఏదో విధంగా విడుదల చేయగలిగితే చాలు అన్నట్లుంది పరిస్థితి.
Advertisement
అయితే కొంతలో కొంత ఆనందం ఏమిటంటే, ఈ మధ్య కాలంలొ వచ్చిన మారుతి ప్రెజెంట్స్ సినిమాలన్నింటి కన్నా, ఈ సినిమా కాస్త బెటర్ అని. వరసపెట్టి మారుతి ప్రెజెంట్స్ అన్నీ ఫట్ ఫట్ మనడంతో వచ్చిన సమస్య కు గ్రీన్ సిగ్నల్ బలైపోతోంది. ఏ మేరకు ఓపెనింగ్స్ వుంటాయా అని యూనిట్ వర్గాలు మా టెన్షన్ గా వున్నాయి.