క్రికెటర్లకీ సినిమా తారలకీ మధ్య ఎఫైర్స్ గురించి ఎప్పటికప్పుడు హాట్ హాట్‌గా గాసిప్స్ విన్పిస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో ఈ గాసిప్స్ నిజమయ్యాయి కూడా. ఒకప్పటి క్రికెటర్ అజారుద్దీన్, బాలీవుడ్ భామ సంగీతా బిజిలానీ వైవాహిక బంధంతో ఒక్కటైన విషయం విదితమే. చెప్పుకుంటూ పోతే సినీ తారలకీ, క్రికెటర్లకీ మధ్య గాసిప్స్ లిస్ట్ చాంతాడంత వుంటుంది.
యువరాజ్ సింగ్ – కిమ్‌శర్మల మధ్య వ్యవహారం చాలా దూరం వెళ్ళినా అది చెడిరది. అచ్చం అలానే తయారయ్యిందట ఇప్పుడు విరాట్ కోహ్లీ – అనుష్క శర్మల మధ్య ఎఫైర్. ప్రస్తుతం విరాట్ కోహ్లీ, నాజూకు నడుము సుందరి ఇలియానాపై కన్నేశాడని బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
అనుష్కని విరాట్ దూరం పెట్టేశాడనీ, కొత్తగా ఇప్పుడు విరాట్ ఎఫైర్స్ లిస్ట్‌లోకి ఇలియానా వచ్చి చేరిందని గాసిప్స్ గుప్పుమంటోంటే, ఇంకా వీటిపై ఇటు విరాట్ కోహ్లీగానీ, అటు ఇలియానాగానీ పెదవి విప్పలేదు. గతంలో జెనీలియాతోనూ విరాట్ కోహ్లీ ఎఫైర్ నడిపాడంటూ గాసిప్స్ వచ్చాయి. మరి, ఇలియానా – విరాట్ మధ్య ఎఫైర్ గాసిప్స్‌కి తెరపడేదెప్పుడో.!