గ‌బ్బర్ సింగ్ కి హీరోయిన్ దొరికింది

గ‌బ్బర్ సింగ్ 2 కోసం ఎంతో మంది క‌థానాయిక‌ల పేర్లు ప‌రిశీల‌నకు వ‌చ్చాయి. బాలీవుడ్ క్రేజీ క‌థానాయిలంద‌రి పేర్లూ వినిపించాయి. ఇప్పుడు ఓ కొత్తమ్మాయి ప‌వ‌న్ ప‌క్కన ఆడిపాడ‌బోతోంది. ఆమె ఎవ‌రో కాదు…. న‌వ‌నీత్…

గ‌బ్బర్ సింగ్ 2 కోసం ఎంతో మంది క‌థానాయిక‌ల పేర్లు ప‌రిశీల‌నకు వ‌చ్చాయి. బాలీవుడ్ క్రేజీ క‌థానాయిలంద‌రి పేర్లూ వినిపించాయి. ఇప్పుడు ఓ కొత్తమ్మాయి ప‌వ‌న్ ప‌క్కన ఆడిపాడ‌బోతోంది. ఆమె ఎవ‌రో కాదు…. న‌వ‌నీత్ కౌర్ దిలాస్. న‌వ‌నీత్ కౌర్‌…. అంటే తెలుగు సినిమాల్లో ఇది వ‌ర‌కు న‌టించిన క‌థానాయిక కాదు. ఈమె మిస్ ఇండియా 2013. 

ఇటీవ‌ల సంప‌త్ నంది ముంబై వెళ్లి ఈ అమ్మాయిని అడిష‌న్స్ చేసొచ్చాడు. ప‌వ‌న్ ప‌క్కన ప‌ర్‌ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతుంద‌న్న ఉద్దేశంతో న‌వ‌నీత్ చేతిలో అడ్వాన్స్ పెట్టి మ‌రీ వ‌చ్చాడ‌ట‌. ఇక ఈ అమ్మాయి దాదాపుగా ఖాయ‌మైన‌ట్టే అని టాలీవుడ్ టాక్‌.   పవన్ తో రోమాన్స్ చేసిన రెండో మిస్ ఇండియా అవుతుంది.  2007 సారా (పంజా)తో ప‌వ‌న్  రొమాన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా ఫ్లాప్‌. ఈసారైనా ప‌వ‌న్‌కి మిస్ ఇండియా హిట్ ఇస్తుందో లేదో చూడాలి.