గుండు.. ఆపై టట్టూలు

హీరో అంటే ఎలా వుండాలి. హీరోలా వుండాలి. కానీ డిఫరెంట్ క్యారెక్టర్లు చేస్తూ వస్తున్న శ్రీవిష్ణు ఆలోచనలు మాత్రం వేరు. వీరభోగ వసంతరాయలు అనే సినిమా చేస్తున్నాడు. టైటల్ నే చిత్రంగా వుంది. ఇదేదో…

హీరో అంటే ఎలా వుండాలి. హీరోలా వుండాలి. కానీ డిఫరెంట్ క్యారెక్టర్లు చేస్తూ వస్తున్న శ్రీవిష్ణు ఆలోచనలు మాత్రం వేరు. వీరభోగ వసంతరాయలు అనే సినిమా చేస్తున్నాడు. టైటల్ నే చిత్రంగా వుంది. ఇదేదో సోషియో ఫాంటసీ అనేలా. పైగా ఈ సినిమాలో నారారోహిత్, సుధీర్ బాబు వున్నారు. అనసూయ కీలకపాత్రలో వుంది.

మరి శ్రీవిష్ణు ఏం చేస్తాడు అంటే అదే సస్పెన్స్ అంట. సినిమాలో శ్రీ విష్ణు గుండుతో ఒళ్లంతా టట్టూలతో కనిపిస్తాడట. ఒకసారి గుబురు జుట్టుతో కనిపిస్తాడట. సినిమా మొత్తానికి కీలకమైన పాత్ర, కానీ అలా అని అంతటా కనిపించకుండా వుంటుందట.

పూర్తి థ్రిల్లర్ గా తయారవుతున్న ఈ సినిమాను త్వరలో జనం ముందుకు తెచ్చే ప్రయత్నాల్లో వున్నారు. కొత్త దర్శకుడు ఇంద్ర ఈ సినిమా రూపకర్త.