విజయ్ దేవరకొండ పక్కా యూత్ ఐకాన్.. యూత్ హీరోగా మారుతున్నాడు. తనను తానే ఓ బ్రాండ్ గా మార్చుకుంటున్నాడు. రౌడీ గ్యాంగ్ అంటూ ఆ మధ్య ఓ హంగామా చేసాడు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా నిన్నటికి నిన్న 'నాకు సరైన షర్ట్ ఇంత వరకు దొరకలేదు' అంటూ బైక్ మీద హాఫ్ నేకెడ్ గా రైడ్ చేస్తున్న పిక్ వదిలాడు.
దానివెనుక వైనం వేరు అని తెలుస్తోంది. రౌడీ అనే బ్రాండ్ నేమ్ తో మార్కెట్ లోకి దుస్తులు వదిలే ఆలోచన ఏదో చేస్తున్నట్లు వినికిడి. పూర్తి వివరాలు ఇంకా బయటకు రావడంలేదు కానీ, ఏదో కంపెనీతో టై అప్ పెట్టుకుని రౌడీ బ్రాండెడ్ దుస్తులు మార్కెట్ లోకి తీసుకువచ్చే ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతానికి రౌడీ క్లబ్ డాట్ ఇనే అనే వెబ్ సైట్ పెట్టి, దాంట్లో జనాల ఆసక్తిని మెంబర్ షిప్ ను తీసుకుంటున్నారు. దీనివెనక అంతా బ్రాండెడ్ క్లోత్స్ మార్కెటింగ్ వుందని తెలుస్తోంది. ఏమైనా విజయ్ దేవరకొండ ఆలోచనలు అన్నీ డిఫరెంట్ గా సాగుతున్నాయి. ఓ పక్క నాలుగు సినిమాలు విడుదల కావాల్సి వుంది. గీతగోవిందం, టాక్సీవాలా, నోటా, డియర్ కామ్రేడ్.. ఇలా వుంది వాటి ఆర్డర్.