గుండు.. ఆపై ఒంటినిండా టట్టూలు

ఇద్దరు ముగ్గురు స్టార్లు కలిసి సినిమా చేయడం ఇటీవల కామన్ అయిందన్న సంగతి తెలిసిందే. అలాంటి సినిమా మరోటి వస్తోంది. నారా రోహిత్, శ్రీవిష్ణు, సుధీర్ బాబు కలిసి ఓ సినిమా చేస్తున్నారు. Advertisement…

ఇద్దరు ముగ్గురు స్టార్లు కలిసి సినిమా చేయడం ఇటీవల కామన్ అయిందన్న సంగతి తెలిసిందే. అలాంటి సినిమా మరోటి వస్తోంది. నారా రోహిత్, శ్రీవిష్ణు, సుధీర్ బాబు కలిసి ఓ సినిమా చేస్తున్నారు.

పైగా హీరోయిన్ శ్రియ ఈ హీరోలతో కలిసి చేయడం ఇంకా విశేషం. హీరో శ్రీ విష్ణు విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఇటీవలే నీదీ నాదీ ఒకే కథ సినిమాతో మాంచి మార్కులు కొట్టేసాడు.

ఇప్పుడు మరో డిఫరెంట్ మూవీ ప్రారంభించి ఫినిష్ చేసేసాడు. ఆ సినిమాలో శ్రీ విష్ణు క్యారెక్టర్ డిఫరెంట్ గా వుంటుంది. దాదాపు గుండుతో, ఒంటి నిండా టట్టూలతో కనిపిస్తాడు శ్రీ విష్ణ. ఈ సినిమా టైటిల్ కూడా చిత్రంగా వుంది. 'వీర భోగ వసంత రాయలు' అన్నది టైటిల్.

ఈ సినిమాలో శ్రీవిష్ణుతో పాటు నారా రోహిత్, సుధీర్ బాబు కూడా పాత్రలు పోషించడం విశేషం. వీరి ముగ్గురితో పాటు హీరోయిన్ శ్రియ కీలక పాత్ర పోషిస్తోంది.

టోటల్ షూట్ పూర్తయిన ఈ సినిమా సమ్మర్ చివర్న థియేటర్లలోకి వచ్చే అవకాశం వుంది.