హరీష్ ప్రెజర్ ఇంతా అంతా కాదా?

దాదాపు ఏడాది కావస్తోంది, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ విడుదలై. ఇంతవరకు మరో సినిమా రాలేదు దర్శకుడు హరీష్ శంకర్ కు. ఎన్నివార్తలు వినవచ్చినా..అన్నీ గ్యాసిప్ లే అని తేలిపోయింది. మొత్తం మీద బన్నీకి ఓ…

దాదాపు ఏడాది కావస్తోంది, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ విడుదలై. ఇంతవరకు మరో సినిమా రాలేదు దర్శకుడు హరీష్ శంకర్ కు. ఎన్నివార్తలు వినవచ్చినా..అన్నీ గ్యాసిప్ లే అని తేలిపోయింది. మొత్తం మీద బన్నీకి ఓ లైన్ నచ్చింది. అయితే హరీష్ తోనా, ఇంకేదైనా బెటర్ ఆప్షన్ వుందా అని ఆలోచన. లింగుస్వామితో సమస్యలు కొన్ని వున్నాయి.. విక్రమ్ కుమార్ రెడీ కావడానికి టైమ్ పడుతుంది.. త్రివిక్రమ్ తను తరువాతి సినిమా పవన్ తో అన్నారు. 

ఇంకెవరు వున్నారు.. అందర్నీ అడుగుతున్నాడు. ఈలోగా దిల్ రాజు.. హరీష్ ఒకటే ప్రెజర్ అని బోగట్టా.. తమ సినిమా చేయమని దిల్ రాజు.. బయట వెబ్ లో ఏవేవో వార్తలు వస్తున్నాయి.. నాతో సినిమా కన్ ఫర్మ్ చేయండి ప్లీజ్ అంటూ హరీష్ తెగ వత్తిడి చేసారని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా.  గీతా ఆర్ట్స్ కు ఓ ధీమా వుంది. కాస్త విషయం వున్న డైరక్టర్, ఓ మంచి లైన్ వుంటే చాలు.. మిగతాది తాము నడిపించేస్తామని. 

హీరో స్టయిలింగ్..మ్యానరిజమ్స్, పాటలు, డ్యాన్స్ లు, ఫైట్లు అన్నీ బన్నీ పర్సనల్ గా కేర్ తీసుకుంటాడు. ఇక సినిమా స్క్రిప్ట్ విషయంలో అరవింద్ చాలా కేర్ గా వుంటారు. సరైనోడు క్లయిమాక్స్ స్క్రిప్ట్ సెట్ అయ్యేవరకు సినిమాను పక్కన పెట్టారు కూడా. అవసరం అయితే ఒకటి రెండు సార్లు తీయడానికి, కోతలు వేయడానికి అరవింద్ వెనుకాడరు. 

ఫైనల్ ప్రొడక్ట్ ఆయనకు ఓకె కావాలంతే. సో..హరీష్ చెప్పిన లైన్ నచ్చడంతో ప్రొసీడ్ అన్నారు. ఒక పక్క స్క్రిప్ట్ రెడీ అవుతుంటేనే..నోట్ ఇచ్చేద్దాం అని వత్తిడి రావడంతో ఇక చివరకు సరే అనక తప్పలేదని తెలిసింది. అంతా బాగానే వుంది. మరి బన్నీ ఓకే చేసి, స్క్రిప్ట్ రెడీ గా వుంటే, వచ్చే సమ్మర్ కు రిలీజ్ ప్లాన్ చేయడం ఏమిటో? సంక్రాంతి ఏడు నెలల దూరంలో వుండగా?