రెజ్లర్‌గా అనుష్క పాట్లు అన్నీ ఇన్నీ కావట

రెజ్లింగ్‌ అంటే ఆషామాషీ కాదు. రెజ్లింగ్‌.. మల్లయుద్ధం.. పేరేదైనా సరే, దీనికి కండబలం అవసరం. కండబలానికి తగ్గట్టుగా బుద్ధిబలం కూడా వుండాలి. బాలీవుడ్‌ బ్యూటీ అనుష్క శర్మని చూస్తే, 'పిట్ట'లా కన్పిస్తుంది. ఆమె ఇప్పుడు…

రెజ్లింగ్‌ అంటే ఆషామాషీ కాదు. రెజ్లింగ్‌.. మల్లయుద్ధం.. పేరేదైనా సరే, దీనికి కండబలం అవసరం. కండబలానికి తగ్గట్టుగా బుద్ధిబలం కూడా వుండాలి. బాలీవుడ్‌ బ్యూటీ అనుష్క శర్మని చూస్తే, 'పిట్ట'లా కన్పిస్తుంది. ఆమె ఇప్పుడు రెజ్లర్‌గా కనిపించబోతోంది 'సుల్తాన్‌'లో. సుల్తాన్‌లో అనుష్క రెజ్లర్‌గా కనిపించనుందనే వార్త మొదట్లో అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ పాత్ర గురించి మొదట విన్నాక అనుష్క కూడా షాకయ్యిందట. 

సినిమా టీజర్‌ విడుదలయ్యాక వచ్చిన రెస్పాన్స్‌తో 'హమ్మయ్యా..' అని ఊపిరి పీల్చుకుందట అనుష్క. ఇక, సినిమా కోసం తీసుకున్న ట్రైనింగ్‌ గురించి చెబుతూ, ఆ సమయంలో ఓ మగవాడితో కుస్తీ పట్టడం మొదట్లో చాలా ఇబ్బందిగా అనిపించేదట. ఎక్కడెక్కడో తాను అతని శరీర భాగాల్ని తాకుతూ, అదే సమయంలో అతను తన శరీర భాగాల్ని తాకడం కష్టంగా అనిపించి, సినిమా నుంచి వైదొలుగుదామనిపించిందట అనుష్కకి. 

తర్వాత్తర్వాత పాత్రలో లీనమయ్యాక, ఆ ఇబ్బందులేవీ కన్పించలేదని చెబుతోంది అనుష్క. సినిమాలో ఫలానా పాత్ర చేస్తున్నామనగానే, ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తే, లోకాన్ని మర్చిపోతామనీ, అలా మైమర్చిపోయి రెజ్లింగ్‌ నేర్చుకోవడం వల్లే, తెరపై తాను రెజ్లర్‌గా నటించగలిగాననీ అనుష్క చెప్పుకొచ్చింది. 'సుల్తాన్‌'లో సల్మాన్‌ఖాన్‌ హీరోగా నటిస్తున్న విషయం విదితమే. కండలు తిరిగిన శరీరం కాకపోయినా, ఈ సినిమా కోసం కాస్త ఒళ్ళు చేసి, ఫిట్‌గా తయారైంది అనుష్క. 

ఏం చేసినాసరే, 'రెజ్లర్‌' సినిమా వరకూ అనుష్క 'పిట్ట'లానే కన్పిస్తోంది. కానీ, తెరపై చాలా ఘాటుగా ప్రత్యర్థిని దెబ్బకొట్టనుందట అనుష్క.