Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

హరికృష్ణ ఫ్యామిలీ మూవీ

హరికృష్ణ ఫ్యామిలీ మూవీ

వైవిఎస్ చౌదరి చౌరవతో హరికృష్ణ చకచకా అనేక సినిమాలు చేసారు. కానీ ఆ తరువాత మళ్లీ వెనక్కు తగ్గారు. కానీ ఇప్పటికీ మంచి క్యారెక్టర్ పడాలే కానీ, హరికృష్ణ సినిమాకు ప్లస్సే అవుతారు. అందుకే హరికృష్ణను మళ్లీ తెరపైకి తెచ్చే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోంది. 

హరికృష్ణ సూటయ్యే మాంచి క్యారెక్టర్ వున్న కథపై కళ్యాణ్ రామ్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అలాంటి కథ సెట్ కాగానే కళ్యాణ్ రామ్-హరికృష్ణ కలిసి ఓ సినిమాలో కనిపించే అవకాశం వుంది. బహుశా రాబోయే కొత్త సంవత్సరంలో ఈ కాంబినేషన్ నందమూరి అభిమానులను అలరించవచ్చు. 

అలాంటి కథ దొరికితే, జస్ట్ ఓ లుక్ లో ఎన్టీఆర్ కూడా కనిపించే ఆలోచన వుందని తెలుస్తోంది. ఇప్పటికే ఇలాంటి కథపై ఓ దర్శకుడు కసరత్తు చేస్తున్నాడట. అంటే నందమూరి అభిమానులు కూడా మనం లాంటి సినిమా చూస్తారేమో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?