బాలీవుడ్ భామ శిల్పా శెట్టి చాలాకాలం క్రితం యోగాని ప్రమోట్ చేసే క్రమంలో ఓ యోగా వీడియో విడుదల చేసింది. అప్పట్లో అదో పెద్ద సెన్సేషన్ అయ్యింది. కెరీర్ మొదట్లో శిల్పాశెట్టి ఎలా వుందో, ఇప్పుడూ ఆమె అదే ఫిట్‌నెస్‌ని మెయిన్‌టెయిన్ చేస్తోంది. పెళ్ళయ్యాక, ఆ తర్వాత తల్లి అయ్యాక కూడా ఆమె ఫిజిక్‌లో ఏమాత్రం మార్పు రాలేదు.
తాజాగా, శిల్పాశెట్టిని ఓ సంస్థ భారీ ఆఫర్‌తో సంప్రదించింది. సరికొత్త యోగాసనాలతో వీడియో రూపొందించదలచుకున్నామనీ, మార్కెట్‌లోకి తీసుకురానున్న ఆ యోగా సీడీ – డీవీడీ కోసం పనిచేయాలనీ ఆ సంస్థ ఆమెకు విజ్ఞప్తి చేసిందట. దాంతో, మరో ఆలోచన లేకుండా శిల్పాశెట్టి కూడా ఓకే చెప్పేసినట్లు తెలుస్తోంది. తనతోపాటు తన సోదరి షమితా శెట్టితోనూ ఈ యోగా వీడియోలో నటింపజేయనుంది శిల్పాశెట్టి.
ప్రస్తుతం యోగాలో చాలా కొత్త విధానాల్ని కనుగొంటున్నారు. మొత్తంగా పదికి పైగా 'మోడ్రన్ యోగా' విధానాలు ఈ వీడియోలో దర్శనమివ్వనున్నాయట. వచ్చే ఏడాది ప్రధమార్థంలో విడుదల చేయనున్న ఆ యోగా వీడియోని ప్రపంచ వ్యాప్తంగా మార్కెటింగ్ చేయాలనే లక్ష్యంతో ఆ సంస్థ ముందుకొచ్చింది. ఇందుకోసం శిల్పాశెట్టి అందుకోనున్న రెమ్యునరేషన్ కూడా చాలా భారీగా వుండనుందని తెలుస్తోంది.