భయపడుతున్న హరీష్‌ శంకర్‌

జూ.ఎన్టీఆర్‌ హీరోగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో నిర్మాత దిల్‌ రాజు రూపొందించిన ‘రామయ్య వస్తావయ్య’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టేసింది. దాంతో, ఆ సినిమా ప్రమోషన్‌ కోసం లైవ్‌లో టివి చానల్స్‌ ముందుకు…

జూ.ఎన్టీఆర్‌ హీరోగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో నిర్మాత దిల్‌ రాజు రూపొందించిన ‘రామయ్య వస్తావయ్య’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టేసింది. దాంతో, ఆ సినిమా ప్రమోషన్‌ కోసం లైవ్‌లో టివి చానల్స్‌ ముందుకు రాడానికి దర్శకుడు హరీష్‌ శంకర్‌ తెగ భయపడి పోతున్నాడు. 

ఇంకోపక్క త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ టివి9 లైవ్‌కు వెళ్లి, ఎన్‌టివి కి వెళ్లకపోవడంతో ఆ చానల్‌ త్రివిక్రమ్‌పై నెగెటివ్‌ స్టోరీ ప్రసారం చేశారని విూడియా వర్గాల్లో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. 

అందుకనే సినిమా ప్రమోషన్‌ కోసమే అయినా, ఒక చానల్‌కు వెళ్లి మరో చానల్‌కు వెళ్ళకపోతే నెగెటివ్‌గా చూపిస్తారనీ, అంతే కాకుండా లైవ్‌కు వస్తే ఫ్యాన్స్‌తో ఫోన్‌ ఇన్‌ పెట్టి ఇబ్బంది పెడతారని, బాలయ్య ఫ్యాన్స్‌ కాంట్రవర్సీ ప్రశ్నలు అడుగుతారని హరీష్‌ శంకర్‌ భయపడుతున్నట్టు తెలుస్తోంది. 

అందుకే హరీష్‌ శంకర్‌ ఎలక్ట్రానిక్‌ మీడియాలో లైవ్‌ కార్యక్రమానికి రావడానికి ఇబ్బందిపడుతున్నారని అంటున్నారు ఆయన సన్నిహితులు.