దిల్ రాజు సినిమా కొంటే మిగతా వారు కొనడం ఇంతకు ముందున్న అలవాటు. నిజాం ఏరియాకు దిల్ రాజు ఏదైనా సినిమా కొన్నదంటే మిగతా ఏరియాల్లో వెంటనే బిజినెస్ అయ్యేది. ఏ సినిమాని అయినా దిల్ రాజు కరెక్ట్‌గా జడ్జ్ చేస్తాడని దానర్థం.
కానీ ఇప్పుడు పరిస్థితి తలకిందులు అయ్యింది. దిల్ రాజు ఇప్పుడు ఏదైనా సినిమా కొంటే మిగతా పంపిణీదారులు తెగ భయపడి పోతున్నారట. దిల్ రాజు కొనుక్కునే సినిమా విషయంలో, మిగతా వాళ్ళు కొనాలా వద్దా అని ఆలోచిస్తున్నారట.
ప్రస్తుతం ‘డి ఫర్ దోపిడీ’ సినిమా పరిస్థితి కూడా ఇదే. ఈ సినిమా బిజినెస్ చేసుకుందామని హీరో నాని నిర్మాతగా మారాడు. కాని ఇంతవరకు ఈ సినిమా ఒక్క ఏరియాలో కూడా బిజినెస్ కాలేదు. ఎట్టకేలకు దిల్ రాజు నైజాం ఏరియాలో విడుదల చేస్తున్నారు. దీంతో ఈ సినిమాపై మరింత మందికి అనుమానం వస్తోందని ఫిలిం నగర్ వర్గాలు చర్చించు కుంటున్నాయి.
ఏదైనా టైం బాబు టైం. టైమ్ బాగోనప్పుడు అనుమానాలు పెరిగిపోతాయి, తద్వారా ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది.