వైవిఎస్‌ డ్రాప్‌

మిత్రుడు రవితేజతో ‘నిప్పు’ తీసి చేతులు కాల్చుకొన్నాడు దర్శక నిర్మాత వైవిఎస్‌ చౌదరి. ఫ్రెండ్‌ షిప్‌ ఫ్రెండ్‌ షిప్పే, సినిమా సినిమానే అనే నిజం తెలిసొచ్చింది. అయినా సరే, రవితేజతో మరో సినిమా చేయడానికి…

మిత్రుడు రవితేజతో ‘నిప్పు’ తీసి చేతులు కాల్చుకొన్నాడు దర్శక నిర్మాత వైవిఎస్‌ చౌదరి. ఫ్రెండ్‌ షిప్‌ ఫ్రెండ్‌ షిప్పే, సినిమా సినిమానే అనే నిజం తెలిసొచ్చింది. అయినా సరే, రవితేజతో మరో సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు. ‘బలుపు’ రచయిత బాబి, రవితేజ కలయికలో ఓ సినిమా సెట్‌ చేసి దానికి నిర్మాత అయిపోదామనుకొన్నాడు.‘నిప్పు’తో పోగొట్టుకొంది వడ్డీతో సహా వసూలు చేసుకొందామనుకొన్నాడు వైవీఎస్‌. 

అయితే ఈ సినిమా నుంచి లేటెస్టుగా వైవిఎస్‌ డ్రాప్‌ అయినట్టు సమాచారమ్‌. వైవిఎస్‌కీ, బాబీకి మధ్య సయోధ్య కుదరకే ఈ సినిమాని వదులుకొన్నట్టు సమాచారమ్‌. కథా రచయితగా ఓకే అనిపించుకొన్న బాబి.. దర్శకత్వంలో రాణిస్తాడా?  లేడా? అనే డౌటు కొద్దీ ఈ సినిమానుంచి వైవీఎస్‌ తప్పుకొన్నాడట. 

అదీ మంచిదే. ‘నిప్పు’లాంటి మరో ఫలితం వస్తే.. చేతులు కాదు, ఈసారి వళ్లు కాల్చుకోవలసి వస్తుంది. మరి ఈ బాబిని భరించే నిర్మాత ఎవరో చూడాలి.