సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ తరువాత సరైన సినిమా దొరకలేదు దర్శకుడు హరీష్ శంకర్ కు. బన్నీకి ఓ లైన్ చెప్పాడు. అది బాగుండడం వరకు ఓకె. కానీ ఇప్పుడు బన్నీ చూపు విక్రమ్ కుమార్, లింగుస్వామి వంటి వాళ్ల మీద వుంది. ఆప్షనల్ గా హరీష్ స్క్రిప్ట్ ను అలా వుంచాడు.
ఇదిలా వుంటే విక్టరీ వెంకటేష్ ఏ సంగతి చెప్పకపోవడంతో బండ్ల గణేష్ తను కొన్న టూ కంట్రీస్ ను ఇప్పుడు ఎవరితో చేద్దామా అని చూస్తున్నాడు. ముందు డైరక్టర్ ను ఓకె చేసుకుందామని డిసైడ్ అయ్యాడు. అందుకోసం హరీష్ శంకర్ దగ్గరకు వచ్చి ఆగాడు. ప్రస్తుతం ట్రాక్ రికార్డు బాగున్న నానితో చేస్తే ఎలా వుంటుందని ఆలోచిస్తున్నాడు.
హరీష్ కనుక ఒకె అంటే నానితో తన టూ కంట్రీస్ సినిమా చేయాలన్నది బండ్ల ఆలోచన. అయితే ఆలోచన వరకు బాగానే వుంది కానీ, సినిమా ప్రారంభంలోనే పెళ్లయిపోయి, పెళ్లాన్ని దారిలోకి తెచ్చుకునే పాత్రకు యంగ్ నాని ఎంతవరకు సూట్ అవుతాడన్నది పాయింట్. ఇంతకీ ఇప్పుడు హరీష్ కాస్తా నానితో వెళ్తే, బన్నీ ఏమనుకుంటాడో?