హీరోల చుట్టూ డైరక్టర్ రౌండ్లు

ఎప్పుడో మూడేళ్ల కిందట సినిమా వచ్చిన తరువాత మళ్లీ సినిమా తెరపైకి ఎక్కించడానికి ఎందుకో కాలం కలిసిరావడం లేదు ఓ దర్శకుడికి. ఓ సినిమా చేతిలో వున్నట్లే వుంటుంది. కానీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో…

ఎప్పుడో మూడేళ్ల కిందట సినిమా వచ్చిన తరువాత మళ్లీ సినిమా తెరపైకి ఎక్కించడానికి ఎందుకో కాలం కలిసిరావడం లేదు ఓ దర్శకుడికి. ఓ సినిమా చేతిలో వున్నట్లే వుంటుంది. కానీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు. అదుర్స్ సినిమాలో బ్రహ్మానందం బాధలా తయారైంది వ్యవహారం. క్లారిటీ రావడం లేదు.

ఇలాంటి నేపథ్యంలో ఆల్టర్ నేటివ్ చూద్దాం అని ఇటీవల మహేష్ బాబు దగ్గరకు వెళ్లారట. అయిదు నెలలు టైమ్ ఇస్తే చాలు సినిమా లాగించేస్తా, త్రివిక్రమ్ రావడం ఎలాగూ లేటు అయ్యేలా వుంది అంటూ చెప్పాడట. దీనికి మధ్యలో మరో టాప్ డైరక్టర్ రాయబారం. లాబీయింగ్. ఆయిదైనా, ఆర్నెల్లయినా త్రివిక్రమ్ సినిమానే అని మహేష్ తెగేసి చెప్పడంతో వెనక్కు చక్కా వచ్చారట ఆ ఇద్దరు డైరక్టర్లు.

సరే మరో టాప్ హీరో దగ్గరకు వెళ్లి ఓ మలయాళ రీమేక్ చేసేద్దాం అని రిక్వెస్ట్ చేసారట. ఆయన సరే ఓకె అనేసి, నాలుగు రోజుల తరవాత ఫోన్ చేసి, ఆ సబ్జెక్ట్ తనకు సెట్ కాదు అని చెప్పేసారట.

ఇప్పుడు తరువాత టార్గెట్ రామ్ అంట. ఎలాగైనా రామ్ డేట్ లు పట్టాలని ప్రయత్నం. మరి అతగాడు ఏం అంటాడో? కానీ ఈ లోగా తమిళ హీరోల వైపు కూడా ఓ చూపు వేసి వుంచారట. కానీ అక్కడ ఫుల్ స్వింగ్ లో వున్న హీరోలు ఖాళీ లేరు. ఫ్లాపుల్లో వున్నవారే మిగిలారు. వాళ్లు డేట్ లు ఇచ్చినా తీసే నిర్మాత లేరు.

ఇక ఎలాగోలా మొదటి ప్రాజెక్ట్ కే వచ్చి, క్లారిటీ తెచ్చుకుని మొదలెట్టుకోవాలి. కానీ ఈ రౌండ్ల వ్యవహారం ఆ హీరో చెవిలోకి వెళ్లిందని, దాంతో ఆయన మరింత సైలంట్ అయిపోయారని ఇంకో బోగట్టా.