Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

హీరోను కేరవాన్ దిగమన్న హీరోయిన్?

హీరోను కేరవాన్ దిగమన్న హీరోయిన్?

హీరో, హీరోయిన్లు షూటింగ్ టైమ్ లో ఎక్కువ టైమ్ కేరవాన్ ల్లోనే వుంటారు. షాట్ రెడీ అంటేనే కేరవాన్ దిగుతారు. మళ్లీ అలా అని చెప్పి, ఒకరి కేరవాన్ లోకి ఒకరు వెళ్లరు. 

ముఖ్యంగా షూటింగ్ టైమ్ లో అందరి కళ్లు వాళ్ల మీదే వుంటాయి కాబట్టి వీలయినంత జాగ్రత్తగా వుంటారు. అయితే అవసరం అయితే ముందుగా కబురు చేసి వెళ్లడం అన్నది కామన్. 

ఆ మధ్యన ఇలా హీరోయిన్ కేరవాన్ లోకి వెళ్లిన ఓ హీరోకి చేదు అనుభవం ఎదురయిందని తెలుస్తోంది. కాస్త ఆలస్యంగా వినిపిస్తోందీ గ్యాసిప్. ఓ పెద్ద సినిమా హీరో ఎందుకో, ఏ కారణంతోనో హీరోయిన్ కేరవాన్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. 

ఒకటి రెండు నిమిషాలు కాకుండానే కేరవాన్ దిగిపోమ్మని హీరోయిన్ కాస్త గట్టిగా చెప్పడంతో హర్ట్ అయిన హీరో దిగి వచ్చేసినట్లు తెలుస్తోంది. 

ఇది ఇలా వుంటే ఈ హీరోయిన్ కు ఈ మధ్య కాస్త ఆటిట్యూడ్ ఎక్కువ అయిందని, ఇద్దరు ముగ్గురు డైరక్టర్లు, ఓ యంగ్ పాపులర్ హీరో అండగా వుండడంతోనే, ఆమె ఈ విధంగా బిహేవ్ చేస్తోందని గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?