హీరోగారు..రచ్చరంబోలా

అసలే బడా హీరో..ఆపై నాలుగైదు రౌండ్లు లోపలకు వెళ్లాయి. ఇంకే ముంది..రచ్చరంబోలా. ఇదీ నిన్నటికి నిన్న ఓ విదేశంలో జరిగిన సంగతి అని టాలీవుడ్ లో గుసగుస వినిపిస్తోంది. మనవాళ్లు ఏదో వంకన ఏదో…

అసలే బడా హీరో..ఆపై నాలుగైదు రౌండ్లు లోపలకు వెళ్లాయి. ఇంకే ముంది..రచ్చరంబోలా. ఇదీ నిన్నటికి నిన్న ఓ విదేశంలో జరిగిన సంగతి అని టాలీవుడ్ లో గుసగుస వినిపిస్తోంది. మనవాళ్లు ఏదో వంకన ఏదో దేశం వెళ్లడం కామన్. అలాగే అవార్డులనీ..అవనీ..ఇవనీ..మనవాళ్లూ..వెళ్తూ వుంటారూ..అక్కడ..మరీ..విందులు..చిందులు..వేస్తూ వుంటారు. 

ఇలాగే ఓ ఫంక్షన్ కు ముందు కాస్త మందెక్కువైన మన హీరోగారు, తన చేష్టలతో అక్కడి జనాలను, మిగిలిన సినిమా వాళ్లను కాస్త బాగానే ఎంటర్ టైన్ చేసారని వినికిడి. పెద్ద హీరో, పైగా కాస్త పవర్ వున్న హీరో కావడంతో, ఇంక మిగిలిన వారు అంతా గమ్మున వుండిపోయారట. దాందే ముంది, చూస్తూ గమ్మున వుంటే పోలా..కాస్త దిగితే మళ్లీ మామూలైపోతారని ఊరుకున్నారట.