ఈ మూడూ మహేష్ బాబు సినిమాలే. ఈ మూడింటికి ఓ పోలిక వుంది. ఖలేజాలో ఫుల్ లెంగ్త్ పంచ్ లు వేస్తూ, జనాలని అద్భుతంగా నవ్విస్తాడు మహేష్. సినిమా ఫలితం ఎలావున్నా, ఇప్పటికీ టీవీల్లో వస్తుంటే జనం ఖలేజాని భలే ఎంజాయ్ చేస్తారు. మహేష్ చేత అలా తన స్టయిల్ లో చేయించాడు త్రివిక్రమ్.
ఆగడు..సినిమా అంతా గడగడా మాట్లాడుతూనే వుంటాడు మహేష్. నిజానికి చాలా మాటలు జనాల చెవులకు చేరి, అర్థం చేసుకుని, ఎంజాయ్ చేసేలోగా, మరో పంచ్ పడిపోతుంటుంది. దాంతో జనాలు అస్సలు ఎంజాయ్ చేయలేకపోయారు. దానికి తగ్గట్టే వచ్చింది ఆ సినిమా ఫలితం.
ఇప్పుడు శ్రీమంతుడు- ఈ సినిమా డైరక్టర్ కొరటాల శివ స్వతహాగా డైలాగ్ రైటర్. కానీ ఎక్కడా పంచ్ లు పేల్చలేదు. డైలాగులు భారీగా లేవు. కానీ సున్నితంగా, అర్థవంతంగావుండేలా, సూటిగా ప్రేక్షకులకు చేరేలా చూసుకున్నాడు. ఒక విధంగా డైలాగులు కాస్త లో ప్రొఫైల్ లోనే సాగాయనే అనుకోవాలి. అయినా జనం ఇప్పుడు భలేగా రిసీవ్ చేసుకున్నారు. డైలాగుల్లో పంచ్ లు లేకున్నా క్లాప్ లు కొడుతున్నారు.
అంటే, మహేష్ కు ఏది పెర్ ఫెక్ట్ గా సూట్ అవుతుంది? కామన్ ప్రేక్షకుల నాడి ఏమిటి అన్నది ఏ డైరక్టర్ పట్టుకున్నట్లు?