హీరోలపై ‘దేశం’ స్ట్రాటజీ?

రాజకీయాలు..సినిమాలు వేరు కాదు..వీళ్ల అవసరం వాళ్లకి…వాళ్ల సాయం వీళ్లకి కామన్. ఎన్నికలు వచ్చినపుడు ప్రచారానికి మనకంటూ నలుగురయినా వుండాలి. అందుకే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆ ఏర్పాట్లలో ముందుకు సాగుతోంది. 2019 ఎన్నికల నాటికి…

రాజకీయాలు..సినిమాలు వేరు కాదు..వీళ్ల అవసరం వాళ్లకి…వాళ్ల సాయం వీళ్లకి కామన్. ఎన్నికలు వచ్చినపుడు ప్రచారానికి మనకంటూ నలుగురయినా వుండాలి. అందుకే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆ ఏర్పాట్లలో ముందుకు సాగుతోంది. 2019 ఎన్నికల నాటికి కనీసం నలుగురు పాపులర్ నటులు తమకు వుండాలని భావిస్తున్నంట్లుంది. అందులో భాగంగానే తారకరత్న కెరీర్ మళ్లీ మొదలయినట్లు వినికిడి.

తారకరత్న కెరీర్ ఒకేసారి తొమ్మిది సినిమా క్లాప్ తో ప్రారంభమైన సంగతి తెలిసిందే. కానీ మళ్లీ అక్కడితోనే ఆగిపోయింది. విలన్ గా ఓసారి ట్రయ్ చేసినా మళ్లీ పుంజుకోలేదు. ఇప్పుడు బాలకృష్ణకు సన్నిహితుడు సాయి కొర్రపాటి నిర్మిస్తున్న సినిమాలో వైవిధ్యమైన విలన్ పాత్రను తారకరత్న పోషిస్తున్నాడు. అదే సాయి కొర్రపాటి రెండు సినిమాలను నారా రోహిత్ తో నిర్మిస్తున్నారు. 

ఇదిలా వుంటే తన అన్న కొడుకులతో పొసగని బాలయ్య బాబు, అల్లుడి కజిన్ సినిమా ఫంక్షన్ కు మాత్రం వచ్చారు. అంతే కాదు, పనికట్టుకుని తారకరత్న బర్త్ డే కు వచ్చారు. అంటే ఆ ఇద్దరి వెనుక తానున్నానన్న సంకేతాన్ని ఆ విధంగా అభిమానులకు పంపించారు. దీంతో ఈ ఇద్దరు నిలదొక్కుకోవడానికి కొంత అవకాశం వుంది. ఇక రాబోయే ఎన్నికల లోగా మోక్షజ్ఞ రంగ ప్రవేశం ఎలాగూ జరుగుతుంది. అంటే తెలుగుదేశం తరపున బాలయ్య కాకుండా మరో ముగ్గురు యంగ్ స్టార్స్ వుంటారన్నమాట. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ అటు వున్నా అప్పుడు ఫరవాలేదు. అదే స్ట్రాటజీ కావచ్చు..అన్నది టాలీవుడ్ గుసగుసల సారాంశం.