Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

'చిలక్కొట్టుడు' మొదలుపెట్టిన హీరో

'చిలక్కొట్టుడు' మొదలుపెట్టిన హీరో

టాలీవుడ్ లో ఇలాంటి వ్యవహారాలు సర్వసాధారణం. తెరవెనక జరగాల్సినవి జరిగిపోతుంటాయి. ఎటొచ్చి ఇలాంటి కార్యకలాపాలు చేయాలంటే స్టార్ స్టేటస్ ఉండాలి. అలా తనకు కూడా స్టార్ డమ్ వచ్చిందనే భ్రమలో ఉన్న ఓ హీరో చిలక్కొట్టుడు స్టార్ట్ చేశాడు. ఇద్దరు ముగ్గురు హీరోయిన్లను కెలికే పనిలో బిజీగా ఉన్నాడు.

రీసెంట్ గా ఓ సినిమా స్టార్ట్ చేశాడు సదరు హీరో. ఇలాంటి యావరేజ్ బడ్జెట్ సినిమాలకు హీరోయిన్ ను సెట్ చేయడం పెద్ద పని కాదు. చాలామంది ఉన్నారు. అవసరమైతే ఓ కొత్తమ్మాయిని తీసుకొస్తారు. కానీ ఇంతవరకు ఆ సినిమాకు హీరోయిన్ సెట్ కాలేదు. దీనికి కారణం హీరోగారి 'పాడు బుద్ధి' అంటున్నారు చాలామంది.

పెద్ద హిట్ కొట్టి, రీసెంట్ గా ఓ పెద్ద సినిమాలో ఐటెంసాంగ్ చేసిన హీరోయిన్ ను ముందుగా అనుకున్నారు. తీరా డిస్కషన్ స్టేజ్ కు వచ్చేసరికి బేరం పెట్టాడు హీరో. రెమ్యూనరేషన్ విషయంలో కాదు, తెరవెనక చేయాల్సిన కోపరేషన్ విషయంలో. దీంతో ఆమె సైడ్ అయిపోయింది.

ఆ తర్వాత గతంలో ఓ సినిమాలో తనతో నటించిన హీరోయిన్ నే సంప్రదించారు. ఆల్రెడీ చేసిన హీరో కాబట్టి ఆమె కూడా వెంటనే ఒప్పుకుంది. కానీ సదరు హీరో బుద్ధి మారిందనే విషయాన్ని గ్రహించలేకపోయింది. తెలుసుకున్న తర్వాత త్వరగానే తప్పుకుంది.

ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు హీరోయిన్లు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఇలాంటి తెరచాటు వ్యవహారాల కోసం ఈ హీరో ప్రత్యేకంగా 'ఆఫీస్' కూడా తెరిచాడు. అక్కడ ఆ ఆఫీస్ ఉందని, అందులో హీరో ఉంటాడని ఇద్దరు ముగ్గురికి తప్ప ఎవ్వరికీ తెలియదు.

ప్రస్తుతం ఈ హీరో వ్యవహారశైలి టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఎంతోమందికి దక్కని పాపులారిటీ ఇతడికి దక్కింది. కానీ దాన్ని చేజేతులా నాశనం చేసుకుంటున్నాడని గుసగుసలాడుకుంటున్నారు జనం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?