సినిమా సినిమాకూ పది కోట్లు హైక్

కొందరు మిడ్ రేంజ్ హీరోల రెమ్యూనిరేషన్లు చూస్తుంటే, కాస్త ఆశ్చర్యంగానే వుంది. ఏణర్ధం కిందట పది కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకున్న ఓ మిడ్ రేంజ్ హీరో ఇప్పుడు 35 కోట్లు అడుగుతున్నారట. ఈ మేరకు…

కొందరు మిడ్ రేంజ్ హీరోల రెమ్యూనిరేషన్లు చూస్తుంటే, కాస్త ఆశ్చర్యంగానే వుంది. ఏణర్ధం కిందట పది కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకున్న ఓ మిడ్ రేంజ్ హీరో ఇప్పుడు 35 కోట్లు అడుగుతున్నారట. ఈ మేరకు వార్తలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.

కొన్నాళ్ల క్రితం ఇరవై కోట్లు అనగానే నిర్మాతలు అమ్మో అనుకున్నారు. 25 అనగానే బాబోయ్ అనుకున్నారు. 30 ఆఫర్ చేసారు అని వినగానే.. నిట్టూర్చి ఊరుకున్నారు. ఇప్పుడు 35 అడుగుతున్నారని తెలిసి సైలంట్ అవుతున్నారు.

సేమ్ రేంజ్ తమిళ హీరో కూడా ఇప్పుడు తెలుగులో నటించాలంటే 35 కోటు అడుగుతున్నారట. ఇప్పటికే ఒకటి రెండు స్ట్రయిట్ తెలుగు సినిమాలు చేసారు. రెండో సినిమాకు 30 కోట్లు తీసుకుంటున్నారట. ఇకపై ఎవరైనా డేట్ లు అడిగితే ముఫై అయిదు తప్పకుండా అడుగుతారని చెప్పుకుంటున్నారు.

పోనీ హిట్ నో, కాస్త నాన్ థియేటర్ మార్కెట్ నో వుంది కనుక అడుగుతున్నారు అని అర్థం చేసుకోవచ్చు. అసలు హిట్ లు లేకుండా కూడా పాతిక కోట్లకు కిందకు రావడం లేదు ఒక హీరో. పది కోట్ల కిందకు దిగడం లేదు మరో హీరో. సినిమానే చేతిలో వుంటుందో వుండదో తెలియదు, పదమూడు కోట్లు అనే అంకె పెట్టుకుని కూర్చున్నారు ఇంకో హీరో. దటీజ్ టాలీవుడ్.