తండ్రీకొడుకుల కథ.. మధ్యలో మనీ హెయిస్ట్

భజే వాయు వేగం.. ఈ సినిమా టీజర్ లోనే తండ్రీకొడుకుల మధ్య అనుబంధాన్ని కాస్త చూపించారు. దాంతో పాటు ఓ దొంగతనం, డబ్బు కోసం ఛేజింగ్ లాంటి అంశాలున్నాయి. తాజాగా రిలీజైన ట్రయిలర్ లో…

భజే వాయు వేగం.. ఈ సినిమా టీజర్ లోనే తండ్రీకొడుకుల మధ్య అనుబంధాన్ని కాస్త చూపించారు. దాంతో పాటు ఓ దొంగతనం, డబ్బు కోసం ఛేజింగ్ లాంటి అంశాలున్నాయి. తాజాగా రిలీజైన ట్రయిలర్ లో ఇవే అంశాన్ని ఇంకాస్త వివరంగా చూపించారు.

చిరంజీవి చేతుల మీదుగా లాంచ్ అయిన భజే వాయువేగం ట్రయిలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. సినిమాలో కావాల్సినంత థ్రిల్ తో పాటు, మంచి ఎమోషన్ ఉందనే విషయం ట్రయిలర్ చూస్తే అర్థమౌతోంది.

కార్తికేయ పెర్ఫార్మెన్స్ ట్రయిలర్ లో హైలెట్ గా నిలిచింది. కోట్ల రూపాయల దొంగతనానికి, ఇతడికి ఏంటి సంబంధం అనేది సస్పెన్స్ పాయింట్. ఇక ట్రయిలర్ చివర్లో.. ‘మన నాన్న కాదురా, నా నాన్న’ అంటూ రాహుల్ టైసన్ తో చెప్పించిన డైలాగ్, సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచింది.

“నా కెరీర్ మొదలై ఆరేళ్లవుతోంది. ఎనిమిది తొమ్మిది సినిమాల్లో నటించాను. వాటిలో కొన్ని హిట్ అయ్యాయి, మరికొన్ని ఫ్లాప్ అయ్యాయి. లాస్ట్ మూవీ బెదురులంక బాగా పే చేసింది. ఒక పర్పెక్ట్ మూవీతో నా అడుగు ముందుకు పడలేదని అనిపిస్తుంటుంది. ఆర్ఎక్స్ 100 తర్వాత నాకు భజే వాయు వేగం మరో బెంచ్ మార్క్ మూవీ అవుతుంది.”

ఇలా సినిమాపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు హీరో కార్తికేయ. ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను ఈనెల 31న థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. ప్రశాంత్ రెడ్డి దర్శకుడు