హీరో హీరోయిన్లు చెట్టపట్టాలు వేసుకుని తిరగడం కామన్. డైరక్టర్-హీరోయిన్ కలిసిపోవడం వెరైటీ. అదేంటో టాలీవుడ్ లో హీరోయిన్లు హీరోల కన్నా డైరక్టర్లను ఎక్కువ ఇష్టపడతారు.
పైగా ఈ మధ్య అంతా యంగ్ డైరక్టర్లే..హీరోల లెవెల్ కాకున్నా కాస్త అందంగానే వుంటున్నారు. అందుకే ఓ నార్త్ హీరోయిన్ మన సౌత్ డైరక్టర్ తో చెట్టపట్టాలు వేసుకుని తిరిగేస్తోందట. ఎలాగూ ‘హిట్’ ఇచ్చాడు కదా..మళ్లీ చాన్స్ ఇస్తాడనేమో?
మన డైరక్టర్ కూడా కాస్త రసికుడే అంట..కుర్రాడు కదా..అమ్మాయిలు అంటే కాస్త ఎక్కువ ఇష్టమే అని టాక్ వినిపిస్తోంది. అందుకే దగ్గరకు చేరి హీరోయిన్ తో మాంచి క్లోజ్ రిలేషన్ షిప్ మెయింటెయిన్ చేస్తున్నాడట.
పెద్దగా అందమైన హీరోయిన్ కాదు. అందువల్ల టాప్ హీరోల పక్కన అవకాశాలు ఎక్కువ ఎక్స్ పెక్ట్ చేయక్కరలేదు. మిడ్ రేంజ్ వరకు ఓకె. అందుకే ప్రస్తుతానికి ఈ డైరక్టర్ కు కనెక్ట్ అయిపోయి అవకాశాల వేటలో వుందట ఆ అమ్మడు.