ఆ హీరోయిన్ పాలిట తండ్రే పెద్ద విలన్..!

ఆమె ఒక వెటరన్ నటీమణి. నాట్యకారిణి కూడా. 80లలో ప్రస్థానం మొదలు పెట్టి… 90 లలో కూడా నటిగా తన ప్రత్యేకతను చాటుకుని.. ఈ మధ్య కూడా కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసింది…

ఆమె ఒక వెటరన్ నటీమణి. నాట్యకారిణి కూడా. 80లలో ప్రస్థానం మొదలు పెట్టి… 90 లలో కూడా నటిగా తన ప్రత్యేకతను చాటుకుని.. ఈ మధ్య కూడా కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసింది తను. ఏ పాత్రను చేసినా.. తన తన ఉనికిని చాటగలగడం ఆమెకు ఉన్న ప్రతిభ. ఇలాంటి ఆ నటీమణి ఆ మధ్య వివాహం చేసుకుంది. అది కూడా కొంత లేటు వయసులో.

అప్పటికే హీరోయిన్ గా కెరీర్ చరమాంకానికి చేరి, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రస్థానం ప్రారంభించి.. కొన్ని మలయాళ ద్వితీయ శ్రేణి సినిమాల్లో కూడా నటించిన తర్వాతే.. ఆమె పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టింది.

అయితే మొదట్లో ఆ పెళ్లి ప్రయత్నాలకు తన తండ్రి అడ్డంకి కావడమే ఆమె విషయంలో విశేషం. మరి ఆయన ఎందుకు అడ్డంకి అయ్యాడు.. ఎలా అడ్డంకి అయ్యాడు అంటే… సదరు హీరోయిన్ తండ్రి కి చాలా చెడ్డ పేరుంది. ఆ పేరు ఎలాంటిదంటే.. ఆయన ఒక వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తాడని. ఆ బిజినెస్ లో ఆయన తలపండిపోయిన వ్యక్తి. పోలీసుల అరెస్టు చేయడం వరకూ వెళ్లింది వ్యవహారం! ఇంకే ముంది.. ఆప్రభావం కూతురి పెళ్లి మీద పడింది. ఆమె పేరున్న హీరోయిన్ అయినప్పటికీ.. తండ్రి నేపథ్యం, అరెస్టు.. ఈ వ్యవహారాలు ఆమెకు పీడకల గా  మారాయి. దీంతో సదరు హీరోయిన్ కు పెళ్లి సంబంధాలు చేదు అనుభవంగా మారాయి.

దీంతో కొన్ని సంవత్సరాల పాటు ఆమె వివాహం ఆలోచనను పక్కన పెట్టింది. చివరకు ముదురు వయసులో వివాహం చేసుకుని సెటిలయ్యింది. తను కాకపోయినా.. తండ్రి చేసిన తప్పులకు ఆ విధంగా ఆ హీరోయిన్ ఇబ్బంది పడింది పాపం!