Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

హీరోయిన్ తో మెగా హీరో పెళ్లి?

హీరోయిన్ తో మెగా హీరో పెళ్లి?

టాలీవుడ్ లో ఈ రోజు ఓ హాట్ గ్యాసిప్ గుప్పమంది. పాతిక లక్షల విలువైన డైమండ్ రింగ్ తీసుకుని ఓ మెగా హీరో బెంగళూరు బయల్దేరి వెళ్లారని, అక్కడ ఓ హీరోయిన్ కు పెళ్లి ప్రపోజ్ చేయబోతున్నారన్నది ఆ గ్యాసిప్. 

మెగా హీరోల్లో పెళ్లి కాని వారు ఇద్దరు ముగ్గురు వున్నారు. మరి ఈ మెగా హీరో ఎవరు అన్నది క్లారిటీగా తెలియడం లేదు. అలాగే ఇది నిజమేనా? వట్టి గ్యాసిప్ నా అన్నది క్లారిటీ లేదు. 

వినిపిస్తున్న గ్యాసిప్ నిజమైతే ఆ మెగాహీరో వరుణ్ తేజ్ అని ఆ హీరోయిన్ లావణ్య త్రిపాఠీ అని అంటున్నారు. కానీ అది పక్కానా జస్ట్ గాలిబుడగ గ్యాసిప్ నా అన్నది మాత్రం ఈ సాయంత్రానికి తెలిసిపొతుంది. 

ఈ ఇద్దరు కలసి గతంలో కొన్ని సినిమాల్లో నటించారు. ప్రస్తుతం లావణ్య బిజీ హీరోయిన్ కాకపోయినా వరుణ్ మాత్రం ఫుల్ లైనప్ తో వున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?