హీరోయిన్ వింత అలవాటు

ఆ హీరోయిన్ అందంగా వుంటుంది. పొడగరి. సొగసరి.  మంచి సినిమాలు చేసింది. మంచి నటి అనిపించుకుంది. లాస్ట్ ఇయర్ కూడా ఆమె ఖాతాలో మంచి ఫ్యామిలీ హిట్ వుంది. అన్నీ బాగానే వున్నాయి. అంతా…

ఆ హీరోయిన్ అందంగా వుంటుంది. పొడగరి. సొగసరి.  మంచి సినిమాలు చేసింది. మంచి నటి అనిపించుకుంది. లాస్ట్ ఇయర్ కూడా ఆమె ఖాతాలో మంచి ఫ్యామిలీ హిట్ వుంది. అన్నీ బాగానే వున్నాయి. అంతా బాగానే వుంది. కానీ ఈ అందమైన అమ్మడికి ఓచిత్రమైన అలవాటు వుందట. అది కాస్త ప్రమాదకారి కూడా. 

ఇంతకీ ఆ చెడ్డ అలవాటు ఏమిటంటే, ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ చెప్పడం. పైగా వీళ్లు అలా అని  వాళ్లకి, వాళ్లు అలా అని వీళ్లకి చెప్పడం. పాపులర్ హీరోయిన్ కాబట్టి హీరోలు అందరితో అంతో ఇంతో ఎక్కువ పరిచయమే వుంటుంది. అందువల్ల ఖాళీగా టైమ్ దొరికితే అందరితో మాట్లాడడం కామన్. కానీ ఈ మాట్లాడేటప్పుడే ఆ హీరో ఇలా అన్నాడు, ఇలా గోకే ప్రయత్నం చేసాడు అని ఈ హీరోకి, ఈ హీరో ఇలా అన్నాడు, ఇలా ప్రయత్నం చేసాడు అని ఆ హీరోకి చెబుతుందట.

ఈ అలవాటు వల్ల ఒకటి రెండుసార్లు హీరోలకు హీరోలకు మధ్య మనస్పర్ధలు ఏర్పడే ప్రమాదం కూడా ఏర్పడిందని బోగట్టా. తరువాత తరువాత అందరికీ ఈ అమ్మడి అలవాటు తెలిసి, జాగ్రత్త పడడం ప్రారంభించారట. అందమైన అమ్మడికి ఏమిటో ఈ పాడు అలవాటు పాపం?

మాట ఇచ్చాను.. నిలబెట్టుకున్నాను