తెలుగు హాట్ యాంకర్ అంటే ఎవరో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆ యాంకరమ్మ పేరు అనసూయ. అంచెలంచెలుగా ఎదుగుతున్న ఆమెను చూస్తే కొందరికి అసూయ. అందుకే అప్పుడప్పుడు అనసూయ వివాదాస్పదమ వుతుంటారు. ఒక్కోసారి సోషల్ మీడియాలో ట్రోల్‌కు గురి అవుతుంటారు. అయినప్పటికీ ఎక్కడా మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా లక్ష్యాన్ని సాధించే దిశలో అనసూయ ముందుకెళుతున్నారు.
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే అనసూయ తాజాగా తన భర్తతో దిగిన ఫొటోలను షేర్ చేశారు. భర్తతో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేయడం వెనుక ఓ ప్రత్యేకత ఉంది. అదేంటో తెలుసుకుందాం.
న్యూస్ రీడర్‌గా అనసూయ మొట్ట మొదట కెరీర్ ప్రారంభించారామె. ఆ తర్వాత యాంకరింగ్‌తో ప్రేక్షకుల ఆదరణ పొందారు. దీంతో ఆమె వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. మోస్ట్ పాపులర్ ప్రోగ్రాం జబర్దస్త్ షోలో తన మాటలు, నటనతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఈ క్రమంలో ఆమె వెండితెరపై కూడా అవకాశాలు దక్కించుకున్నారు. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో జీవించి శభాష్ అనిపించుకున్నారు. ప్రస్తుతం కొన్ని సినిమాల్లో ఆమె నటిస్తున్నట్టు సమాచారం.
ఇదిలా ఉంటే అనసూయ తన వివాహ బంధాన్ని పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తన ట్విటర్ ఖాతాలో భర్త సుశాంక్ భరద్వాజ్‌తో కలిసి ఉన్న ఫొటోలను పోస్ట్ చేశారు. సుశాంక్, అనసూయ ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పలు సందర్భాల్లో తన ప్రేమ ప్రయాణం గురించి అనసూయ వెల్లడించారు. ఇంటర్ సెకండియర్ చదువుతున్నప్పుడు ఎస్సీసీ క్యాంప్‌నకు అనసూయ వెళ్లారు. అదే క్యాంప్‌నకు సుశాంక్ భరద్వాజ్ కూడా వెళ్లాడట.
ఆ సందర్భంలో అనసూయను పెళ్లి చేసుకుంటానని సుశాంక్ ప్రపోజ్ చేస్తే…అనసూయ మౌనం పాటించిందట. బహుశా అర్ధంగీరానికి అది సూచనమో. ఏడాదిన్నర తర్వాత మళ్లీ ఎన్సీసీ క్యాంప్. ఈ టూర్లో భరద్వాజ్‌తో అనసూయకు స్నేహం కుదిరింది. ఆ తర్వాత చెప్పేదేముంది…ప్రేమ ప్రయాణం. ఇలా తొమ్మిదేళ్ల పాటు ప్రేమించుకున్న తర్వాత పెళ్లి. అంటే పెళ్లికి పదేళ్లైతే…వారిద్దరి ప్రేమకు మాత్రం 19 ఏళ్లు అన్నమాట. అనసూయ వైవాహిక జీవితం ఎప్పట్లాగే సుఖసంతోషాలతో ముందుకు సాగాలని ఆశిస్తూ…