సన్నాఫ్ సత్యమూర్తి తరవాత బన్నీ కాస్త రిలాక్సయ్యాడు. ఫారెన్ ట్రిప్పేసి వచ్చాడు. ఈలోగా బోయపాటి శ్రీను సినిమాకి సంబంధించి స్ర్కిప్టు రెడీ అయిపోయింది. జూన్ ద్వితీయార్థంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. అయితే ఇప్పటి వరకూ కథానాయికలెవరో ఫైనలైజ్‌కాలేదు.
ఇందులో ఇద్దరు నాయికలకు స్థానం ఉంది. అయితే.. ఒక్కరి పేరూ ఖరారు కాలేదు. ఇద్దరూ కొత్తమ్మాయిలనే తీసుకోవాలన్నది బోయపాటి ఉద్దేశం. ఆ బాధ్యత అల్లు అరవింద్ తీసుకొన్నార్ట. ఆయనో లిస్టు రాసుకొని, అందులో బన్నీకి ఎవరైతే బాగుంటారో గుర్తించి, వాళ్లకు కథానాయికగా అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తున్నారని తెలిసింది.
అరవింద్ చూపు బుల్లితెర ధారావాహికల్లో హీరోయిన్లగా రాణిస్తున్నవారిపై ఉందని తెలుస్తోంది. అవికాగోర్‌లా బుల్లితెరపై పాపులర్ అయినవాళ్లని పట్టుకోవాలని చూస్తున్నారట. మరి ఈ అన్వేషణ ఎప్పటికి ఫలిస్తుందో ఏమిటో..?