బాహుబలి హిందీ వెర్షన్ ను సమర్పిస్తున్నాడు బాలీవుడ్ బిగ్గీ కరణ్ జోహార్. కానీ ఇప్పుడు అతగాడు బాహుబలి యూనిట్, అదీ ముఖ్యంగా రాజమౌళి వ్యవహారంపై చాలా అసంతృప్తితో వున్నాడట. ఎప్పుడు విడుదల చేయగలరు అన్నది కచ్చితంగా చెప్పకపోవడమే కరణ్ జోహార్ అసంతృప్తికి కారణంగా తెలుస్తోంది.
'…మీరు సినిమాను ఈ ఏడాది కాకుంటే వచ్చే ఏడాది విడుదలచేయండి..అభ్యంతరం లేదు. కానీ, ఎప్పుడన్నది కచ్చితంగా ఓ డేట్ చెప్పండి'..అన్నిది కరణ్ అభిప్రాయంగా తెలుస్తోంది. కానీ రాజమౌళి ఆ విషయంలో అస్సలు చెప్పలేకపోతున్నాడట.
పైగా బాహుబలి హిందీ వెర్షన్ అంత సులువు కాదు, ఎందుకంటే బాహుబలిలో వాడే భాషతో హిందీకి సింక్రనైజ్ చేస్తూ మాటలు రాయడం కాస్త సవాలే. ఇదంతా కాస్త టైమ్ పట్టే వ్యవహారం. అందుకే రాజమౌళి కూడా టైమ్ చెప్పలేకపోతున్నాడు. మొత్తం మీద బాహుబలి కాస్త టెన్షన్ పెట్టేటట్లే కనిపిస్తోంది.