శ్రీమంతుడు ఫస్ట్ లుక్: బావ కోసం ఓ స్టిల్

మొత్తానికి ఓ స్టిల్ బయటకు వచ్చింది. కొరటాల శివ-మహేష్ బాబు కాంబినేషన్ తయారవుతున్న శ్రీమంతుడు ఫస్ట్ లుక్ ను ఏ హడావుడి లేకుండా వదిలారు. మహేష్ బాబు రౌండ్ నెక్ ఫుల్ హ్యాండ్స్ టీ…

మొత్తానికి ఓ స్టిల్ బయటకు వచ్చింది. కొరటాల శివ-మహేష్ బాబు కాంబినేషన్ తయారవుతున్న శ్రీమంతుడు ఫస్ట్ లుక్ ను ఏ హడావుడి లేకుండా వదిలారు. మహేష్ బాబు రౌండ్ నెక్ ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్ – జీన్స్ తో ఎప్పటిలాగే హ్యాండ్ సమ్ గా కనిపించాడు. అంతకు మించి సినిమాపై కుతూహలం రేకెత్తించే వ్యవహారం ఏమీ లేదు. 

అయితే సినిమాకు, సినిమా హైప్ కు ఈ స్టిల్ ఎంతవరకు పనికి వస్తుందో, రాదో చెప్పలేం కానీ, బావ గల్లా జయదేవ్ కు మాత్రం బాగా పనికి వస్తుంది. సైకిల్ ఎక్కిన మహేష్ బాబు స్టిల్ ను ఆయన తన తెలుగుదేశం ప్రచారానికి బాగా వాడేసుకోవచ్చు. ఎందుకంటే ఆ పార్టీ గుర్తు సైకిలే కదా?