హే.. పవన్.. మళ్లీ అదే మీసమా

కురచ జుట్టు..అక్కడక్కడ నలుపు..తెలుపు..తెల్ల పంచె..లాల్చీ..సీమ ఫ్యాక్షనిస్టుగా పవన్..ఇదీ నిన్నటి దాకా, ఇప్పుడు చివర్న చిన్నగా మెలి తిరిగిన కోరమీసం..డైరక్టర్ మారాక గెటప్ మారిందా? లేక కొత్త డైరక్టర్ కు పాత గెటప్ నచ్చలేదా? ఏమిటో?…

కురచ జుట్టు..అక్కడక్కడ నలుపు..తెలుపు..తెల్ల పంచె..లాల్చీ..సీమ ఫ్యాక్షనిస్టుగా పవన్..ఇదీ నిన్నటి దాకా, ఇప్పుడు చివర్న చిన్నగా మెలి తిరిగిన కోరమీసం..డైరక్టర్ మారాక గెటప్ మారిందా? లేక కొత్త డైరక్టర్ కు పాత గెటప్ నచ్చలేదా? ఏమిటో? డైరక్టర్లు మారిపోవడం, స్క్రిప్ట్ లు మారిపోవడం, ఆఖరికి గెటప్ లు మారిపోవడం. చివరకు కేలండర్లు మారిపోతున్నాయి. 

సరే ఈ సంగతి అలా వుంచితే ఇప్పుడు పవన్ మీసం గెటప్ అంత కొత్తగా ఏమీ లేదు కదా? ఇప్పటి పవన్ కెరీర్ లోని డిజాస్టర్లలో ఒకటైన కొమరం పులిలో జనం చూసేసిందే కదా? అంటే సినిమా ఫ్లాప్ అయినా గెటప్ సూపర్ హిట్ అని అనుకున్నారో? లేక ఆ ఫ్లాప్ సినిమా గెటప్ ను ఎలాగైనా సూపర్ హిట్ సినిమాలో చూపించాలని అనుకుంటున్నారో? 

ఇదిలా వుంటే మరో ముచ్చట కూడా వినిపిస్తోంది. విశాఖ మున్సిపల్ ఎన్నికల్లో వైకాపా కాస్త గట్టిపోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది తేదేపాకి. ఇక ఇలాంటపుడైనా పోటీకి దిగి ఆదుకోకుంటే మిత్ర ధర్మ దెబ్బతింటుంది..అందువల్ల జనం ముందుకు వెళ్లి తను గడచిన రెండేళ్లుగా జనసేన తరపును ప్రభుత్వాన్ని ఏ విధంగా నిలదీసిందీ చెప్పి, మీసం మెలేయడానికి వీలుగా వుంటుందనా? అన్న సెటైర్లు కూడా వినిపిస్తున్నాయి.