హిందీ సినిమాకే రాజమౌళి ఫిక్స్?

బాహుబలి 2 తరువాత దర్శకుడు రాజమౌళి ఏ సినిమా చేయబోతున్నారు? ఎవరితో ఛేయబోతున్నారన్నది ఇంకా కన్ ఫర్మ్ కాలేదు. ఎప్పుడో కొటి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చిన డివివి దానయ్య నిర్మాత అన్నది మాత్రం క్లియర్…

బాహుబలి 2 తరువాత దర్శకుడు రాజమౌళి ఏ సినిమా చేయబోతున్నారు? ఎవరితో ఛేయబోతున్నారన్నది ఇంకా కన్ ఫర్మ్ కాలేదు. ఎప్పుడో కొటి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చిన డివివి దానయ్య నిర్మాత అన్నది మాత్రం క్లియర్ అయింది. అయితే లేటెస్ట్ బజ్ ఏమిటంటే, స్ట్రయిట్ హిందీ సినిమా చేయడానికే రాజమౌళి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

బాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరితో, బాలీవుడ్ ప్రొడ్యూసర్ తోనే రాజమౌళి సినిమా చేసే ఆలోచనలో వున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు నిర్మాణ భాగస్వామి గా దానయ్య కూడా వుంటారు. బాలీవుడ్ సీనియర్ హీరోలతో కాకుండా యంగ్ స్టార్ హీరోతో యూత్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ చేసే ఆలోచనలో రాజమౌళి వున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ సినిమా తరువాత తెలుగు టాప్ హీరో ఒకరితో తెలుగు సినిమా చేస్తారట.

డిసెంబర్ నాటికి స్క్రిప్ట్ రెడీ అవుతుందని, అప్పుడే ఫుల్ ప్రాజెక్టు డిటైల్స్ చెబుతానని రాజమౌళి తన నిర్మాతకు చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దానయ్య సూపర్ స్టార్ మహేష్ బాబుతో నిర్మిస్తున్న భరత్ అనే నేను సినిమా కూడా డిసెంబర్ ఎండ్ కు పూర్తవుతుంది.