చుక్కలు చూపించిన పూజా హెగ్డే

ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా.. పూజా హెగ్డే పారితోషికాన్ని రెట్టింపు చేసింది. డీజే సినిమా తర్వాత బెల్లంకొండ సినిమాకు కమిట్ అయిన ఈ బ్యూటీ తన రేటును కోటిన్నరకు పెంచేసింది. ఇక్కడితో ఆగితే…

ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా.. పూజా హెగ్డే పారితోషికాన్ని రెట్టింపు చేసింది. డీజే సినిమా తర్వాత బెల్లంకొండ సినిమాకు కమిట్ అయిన ఈ బ్యూటీ తన రేటును కోటిన్నరకు పెంచేసింది. ఇక్కడితో ఆగితే ఆమె పూజా హెగ్డే ఎందుకు అవుతుంది. చివరికి రిబ్బన్ కటింగులకు కూడా కళ్లుచెదిరే రేటు చెప్పి చుక్కలు చూపించింది ఈ భామ.

ఓ భారీ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం యజమానులు పూజా హెగ్డేను సంప్రదించారు. సాధారణంగా షాప్ ఓపెనింగ్స్ కు కొందరు హీరోయిన్లు ఖరీదైన గిఫ్ట్ లు తీసుకుంటారు. స్టార్ హీరోయిన్లయితే 3 లక్షల వరకు ఛార్జ్ చేస్తారు. పూజా హెగ్డే మాత్రం ఏకంగా 10 లక్షలు డిమాండ్ చేసి షాకిచ్చింది.

షాప్ ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఇలా వచ్చి రిబ్బన్ కట్ చేసి అలా ఫొటోలకు పోజులిచ్చి వెళ్లిపోవడమే. గట్టిగా చెప్పాలంటే 30 నిమిషాల వ్యవహారం. దీనికే 10 లక్షలు డిమాండ్ చేసింది పూజా హెగ్డే.

దీంతో సదరు షాపు యజమానులు అవాక్కయ్యారు. కనీసం చర్చలు జరిపే స్థాయిలో కూడా రెమ్యూనరేషన్ లేకపోవడంతో మారుమాట్లాడకుండా వెళ్లిపోయారు. షాపు ఓపెనింగ్ కే ఇంత అడిగిన పూజా హెగ్డే.. ఫొటోషూట్లు, వాణిజ్య ప్రకటనల్లో నటించడానికి ఇంకెంత డిమాండ్ చేస్తుందో!