తమ్ముడి ఇంటికి రవితేజ

హీరో రవితేజ కుటుంబంలో అనుకోకుండా జరిగిన విషాద సంఘటన కాస్త సంచలనమే సృష్టించింది. రవితేజ సోదరుడు భరత్ మరణం, అంత్యక్రియలకు రవితేజ, ఆయన తల్లితండ్రులు వెళ్లకపోవడం, ఆ తరువాత ఆ డ్యామేజ్ ను కవర్…

హీరో రవితేజ కుటుంబంలో అనుకోకుండా జరిగిన విషాద సంఘటన కాస్త సంచలనమే సృష్టించింది. రవితేజ సోదరుడు భరత్ మరణం, అంత్యక్రియలకు రవితేజ, ఆయన తల్లితండ్రులు వెళ్లకపోవడం, ఆ తరువాత ఆ డ్యామేజ్ ను కవర్ చేయడానికి ఆయన ప్రయత్నాలు అన్నీ సోషల్ మీడియాలో కాస్త హల్ చల్ చేసాయి.

ఓ దినపత్రిక ఈ విషయంలో తొందరపడి తెలిసీ తెలియని విషయం రాయడం, మళ్లీ అదే పత్రిక, రవితేజ వెర్షన్ కు అధిక ప్రాధాన్యత ఇవ్వడం కూడా జరిగింది.

ఆ దుర్ఘటన జరిగి అప్పడే చకచకా రోజులు గడచిపోయాయి. భరత్ అంత్యక్రియలకు సంబంధించిన కొన్ని కార్యక్రమాలు మాదాపూర్ లో భరత్ వుండే అపార్ట్ మెంట్ లో జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఈ కార్యక్రమాలకు రవితేజ స్వయంగా హాజరవుతున్నారు. రవితేజ తో పాటు ఆయన కుటుంబసభ్యులు, సన్నిహిత బంధువులు అందరూ హాజరవుతున్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి భరత్ ఒంటరిగా వుంటున్నారు. కానీ ఇన్నాళ్లూ ఆ ఇంట్లోనే వుంటున్నందున, అక్కడే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.