ఆ హీరోతో ఇలియానా ఆరేళ్లు డేటింగ్ చేసిందట!

తన బాయ్ ఫ్రెండ్ ను అస్సలు దాచి పెట్టడం లేదు ఇలియానా. చాలా మంది హీరోయిన్లు ఇలాంటి విషయాన్ని గుట్టుగా ఉంటారు.. అయితే ఇలియానా మాత్రం గోవా బీచ్ లలో బాయ్ ఫ్రెండ్స్ తో…

తన బాయ్ ఫ్రెండ్ ను అస్సలు దాచి పెట్టడం లేదు ఇలియానా. చాలా మంది హీరోయిన్లు ఇలాంటి విషయాన్ని గుట్టుగా ఉంటారు.. అయితే ఇలియానా మాత్రం గోవా బీచ్ లలో బాయ్ ఫ్రెండ్స్ తో పంచుకుంటున్న ప్రతి ఆనందాన్నీ ఇన్ స్టాగ్రమ్ ద్వారా అందరికీ వివరిస్తోంది. ఇంత ఓపెన్ గా ఉంటోంది ఈ గోవా భామ. ఒక ఆస్ట్రేలియన్ ఫొటో గ్రాఫర్ తో ఇలియానా ప్రస్తుతం పీకల్లోతు ప్రేమలో ఉంది.

కెరీర్ అంత గొప్పగా లేని ఈ సమయంలో ఇలియానా బాయ్ ఫ్రెండ్ తో చట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. మరి ఇదే సమయంలో కొన్ని పాత ప్రేమ వ్యవహారాలను, పాత పరిచయాలను కూడా ఇలియానా ప్రస్తావిస్తోంది. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఇలియానా తన కెరీర్ ఆరంభం నుంచి అనేక విషయాలను చెప్పుకొంది. తను 15 యేళ్ల వయసులోనే హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టానని చెప్పింది.

అది కూడా ఒక తెలుగు సినిమాతో అని చెప్పుకొచ్చింది. దేవదాసు సినిమా ఆరంభం అయినప్పుడు తన వయసు పదిహేను అని చెప్పుకుంది. సినిమా పూర్తయ్యే సరికి దాదాపు రెండేళ్లు గడిచాయి అని వివరించింది. సినిమా షూటింగ్ ఎక్కువగా అమెరికాలో సాగుతుందని దర్శకుడు చెప్పాడని, ఇదేదో ఫ్రీ టూర్ లా ఉందే… అనే ఆనందంతో అందులో నటించడానికి తను ఒప్పుకున్నానని అంది.

ఆ టూర్ వెళ్లినందుకు గానూ భారీ మొత్తం పారితోషకంగా వస్తుండటంతో తన ఆనందానికి అవధుల్లేవని ఇలియానా చెప్పుకుంది. అలాంటి యుక్త వయసులో టాలీవుడ్ లో తన ప్రస్థానం సాగిందని ఇలియానా చెప్పింది. మరి ఆ వయసులో కొన్ని ఎక్సయిట్ మెంట్స్ ఉంటాయి కదా.. అందుకే అప్పట్లోనే ఒక తెలుగు హీరోతో అనుబంధాన్ని నెరిపాను అని వివరించింది.

అతడి పేరేంటో చెప్పలేదు కానీ తామిద్దరం ఆరు సంవత్సరాల పాటు డేటింగ్ లో ఉన్నామని ఇలియానా చెప్పుకురావడం గమనార్హం. అయితే ఆ తర్వాత విడిపోయామని చెప్పింది. పలువురు తెలుగు హీరోలతో ఇప్పటికీ సన్నిహితంగానే ఉంటానని చెప్పింది.

రామ్, రవితేజ వంటి హీరోల పేర్లను ప్రస్తావించింది. మరి ప్రస్తుత లవర్ పేరును దాచడానికి ఏ మాత్రం ప్రయత్నించని ఇలియానా తన మాజీ లవర్ కమ్ ఆ తెలుగు హీరో పేరును మాత్రం చెప్పడం లేదు. తన ఫస్ట్ ఫస్ట్ లవ్ అదే అని చెప్పిన.. ఈమె ఆ లేలేత ప్రేమ ఎవరితోనో మాత్రం దాచేస్తూనే ఉంది.