ఇటు పాతాళ భైరవి.. అటు టైమ్ మెషీన్

ఓ వైపు చిరంజీవి-కొరటాల కాంబినేషన్ పై హాట్ హాట్ చర్చ జరుగుతోంది. వీళ్లిద్దర్నీ ట్రాక్ పైకి తీసుకొచ్చేందుకు రామ్ చరణ్ విశ్వప్రయత్నం చేస్తున్నట్టు టాక్. ఓ వైపు ఈ కాంబినేషన్ ఉంటుండగానే మరోవైపు చిరంజీవి-నాగ్…

ఓ వైపు చిరంజీవి-కొరటాల కాంబినేషన్ పై హాట్ హాట్ చర్చ జరుగుతోంది. వీళ్లిద్దర్నీ ట్రాక్ పైకి తీసుకొచ్చేందుకు రామ్ చరణ్ విశ్వప్రయత్నం చేస్తున్నట్టు టాక్. ఓ వైపు ఈ కాంబినేషన్ ఉంటుండగానే మరోవైపు చిరంజీవి-నాగ్ అశ్విన్ కాంబినేషన్ కూడా హైలెట్ అవుతోంది. మహానటి యూనిట్ ను ప్రత్యేకంగా సత్కరించినప్పట్నుంచి ఈ ప్రచారం ఊపందుకుంది.

వైజయంతీ మూవీస్ బ్యానర్ పై పాతాళ భైరవి లాంటి సినిమా చేయాలని ఉందంటూ చిరంజీవి స్వయంగా ప్రకటిస్తే.. అదే బ్యానర్ పై చిరంజీవి హీరోగా టైమ్ మెషీన్ కాన్సెప్ట్ తో ఓ సోషియో ఫాంటసీ తీయాలని ఉందని నాగ్ అశ్విన్ ప్రకటించాడు. చూస్తుంటే ఏదో మంచి కథే రాసుకొచ్చేట్టున్నాడు.

ప్రస్తుతం చిరంజీవి సైరా సినిమా చేస్తున్నాడు. ఇది కంప్లీట్ అవ్వడానికి కనీసం మరో 4నెలలు పడుతుంది. ఈలోగా అతడి నెక్ట్స్ సినిమాకు సంబంధించి ఇంకెన్ని కాంబినేషన్లు తెరపైకి వస్తాయో చూడాలి. ఈ నయా కాంబినేషన్ల ప్రవాహంలో ఇప్పుడు త్రివిక్రమ్, బోయపాటి లాంటి పేర్లు ఏకంగా కనుమరుగైపోవడం ఆశ్చర్యం.

అటు పూరి జగన్నాధ్-చిరంజీవి సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆటో జానీ ప్రాజెక్టుతో చిరంజీవిని సగం మాత్రమే మెప్పించి తప్పుకున్న పూరి జగన్నాధ్, లేటెస్ట్ గా మెహబూబా లాంటి డిజాస్టర్ ఇచ్చాడు. ఇలాంటి డైరక్టర్ ను పిలిచి మరీ చిరంజీవి అవకాశం ఇస్తాడనుకుంటే అది పగటి కల అవుతుంది.

ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు గమనిస్తుంటే.. అటు కొరటాల లేదా ఇటు నాగ్ అశ్విన్ లో ఒకరికి చిరంజీవి ఛాన్స్ ఇచ్చేలా ఉన్నాడు. మెజారిటీ మెగా వర్గమైతే కొరటాలకే ఓటేస్తోంది. ఎందుకంటే.. వచ్చేది ఎన్నికల సీజన్. కొరటాలతో సినిమా చేస్తే అలా కూడా కలిసొస్తుంది కదా..