cloudfront

Advertisement


Home > Movies - Movie Gossip

సెక్స్‌, కిసెస్‌.. టాలీవుడ్‌ వాళ్ల బాలీవుడ్‌ రూటు!

సెక్స్‌, కిసెస్‌.. టాలీవుడ్‌ వాళ్ల బాలీవుడ్‌ రూటు!

బాలీవుడ్‌ను అనుకరించడం టాలీవుడ్‌కు కొత్త ఏమీకాదు. అబ్బే తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి చేరిపోయిందని బలంగా విశ్వసించే వాళ్ల సంగతిని పక్కనపెడితే అనేక వ్యవహారాల్లో బాలీవుడ్ను మనోళ్లు అనుకరిస్తూ ఉండటాన్ని గమనించవచ్చు. సినిమాల ట్రెండ్స్‌ విషయంలో అయితేనేం, ఫ్యాషన్‌ ట్రెండ్‌ విషయంలో అయితేనేం.. అనేక వ్యవహారాల్లో బాలీవుడ్‌ వాళ్లను మనోళ్లు అనుకరిస్తూ ఉంటారు. ఈ అనుకరణలో ఇప్పుడు మరికొన్ని విషయాలు చేరిపోయాయని స్పష్టం అవుతోంది. ఇప్పుడు బోల్డ్‌గా రియాక్ట్‌ కావడంలో బాలీవుడ్‌ను అనుకరిస్తున్నారు తెలుగు సినీజనాలు. 

గత కొన్నాళ్లుగా బాలీవుడ్‌ జనాలు చాలా బోల్డ్‌గా రియాక్ట్‌ అవుతూ వస్తున్నాయి. తమ వ్యక్తిగత విషయాలను చెప్పుకోవడం అయితేనేం, బహిరంగంగా ప్రవర్తించడంలో అయితేనేం.. హద్దులేం లేవన్నట్టుగా రియాక్ట్‌ అవుతూ వస్తున్నారు. హిందీ టీవీ చానళ్ల టాక్‌ షోల్లో అయితే అక్కడి సినీనటుల కథల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వాటి చాట్‌ షోల్లా కాకుండా హాట్‌ షోలుగా మారిపోయి చాలాకాలం అయిపోయింది. ఈ టాక్‌ షోల్లో సెక్స్‌ గురించి తెగ ప్రస్తావన వస్తూ ఉంటుంది. ఆ వ్యవహారంపై మాట్లాడటానికి ఆ చాట్‌ షో హోస్టులతో పాటు అక్కడకు వచ్చే సినీజనాలు కూడా ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. 

అవతల వచ్చిన వారి వయసెంత? వాళ్లకు పెళ్లైందా? ఎదిగిన పిల్లలున్నారా? వీళ్ల మాటలు వీళ్లను అభిమానించే టీనేజ్‌ పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? అనేవి ఏమాత్రం పట్టకుండా వీళ్లు రియాక్ట్‌ అయిపోతూ ఉంటారు. ఇష్టమైన సెక్స్‌ పొజిషన్‌, సెక్స్‌లో బాగా ఎంజాయ్‌ చేసిన సందర్భం, తొలి సెక్స్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఎప్పుడు? సెక్స్‌ లేకుండా ఎన్నాళ్లు ఉండగలరు? వంటి ప్రశ్నలు సినిమా వాళ్లను హోస్టులు అడగడం, వాటికి సినిమా హీరోహీరోయిన్లు కూడా చాలా హాటుగా నాటుగా సమాధానాలు ఇవ్వడం జరుగుతూ వస్తోంది. ఈ తీరుతో అనేకమంది సెలబ్రిటీలు వార్తల్లోకి వచ్చారు.

చాలామంది తమకు ఏ యాంగిల్‌లో సెక్స్‌ బాగా ఇష్టమో చెప్పారు. వాళ్లకు పెళ్లి కాలేదు కానీ ఇలాంటి విషయాల గురించి చెప్పడం అనేక మందిని ఆశ్చర్యపరించింది. ఇక హీరోలు అయితే తమకు ఏ హీరోయిన్‌ అంటే ఇష్టమో అనే చెప్పే దశదాటిపోయి.. ఏ హీరోయిన్‌ పిరుదులు బాగుంటాయో చెబుతున్నారు. ఇక హీరోల భార్యలనైతే... మీ మొగుడితో కాకుండా వేరే ఏ హీరోతో రొమాన్స్‌ చేయాలనుకుంటున్నారు.. అంటూ అడుగుతున్నారు. ఇంత పచ్చిగా సాగుతున్నాయి బాలీవుడ్‌ టాక్‌ షోలు. వీటికి సెన్సార్‌ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అదలా ఉంటే దక్షిణాదిన కూడా అలాంటి పోకడలు మొదలైనట్టుగా ఉన్నాయి. బాలీవుడ్‌ జనాల్లాగానే తెలుగు సినీ జనాలు కూడా చాలా బోల్డ్‌గా రియాక్ట్‌ కావడం మొదలైంది. దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి కొన్ని వ్యవహారాలు. ఆ మధ్య సమంత 'ఫుడ్‌ సెక్స్‌ ఏదిలేకుంటే నువ్వు ఉండలేవ్‌..' అని ఒక ఇంగ్లిష్‌ మ్యాగజైన్‌ వాళ్లు అడిగిన ప్రశ్నకు 'సెక్స్‌' అని సమాధానం చెప్పుకొచ్చింది. అప్పటికి సమంతకు పెళ్లి కూడా కాలేదు.

అయినా అలా సమాధానం ఇచ్చింది. ఇక ఇటీవలే మహేశ్‌బాబు తన భార్యను గాఢంగా కిస్‌ చేస్తూ దిగిన ఫొటోను షేర్‌ చేయడం.. ఇలాంటి స్టెప్పే. అందులో తప్పేం లేకపోవచ్చు. కిస్‌ చేసింది భార్యనే కావొచ్చు. అయితే కొన్ని పరిమితులు ఉంటే బాగుంటుంది. ఆ మధ్య ఆమీర్‌ ఖాన్‌ ఎయిర్‌ పోర్ట్‌ దగ్గర మీడియా ఎదురుగా తన భార్యను కిస్‌ చేశాడు. అందులో కూడా తప్పులేదు. అయితే సంఘజీవి అయిన మనిషికి ప్రవర్తన విషయంలో కొన్ని పరిధులు ఉన్నాయి.

సినీ జనాలు ఇలాంటి బహిరంగ చుంబనాలు చేస్తే కొందరు అందులో తప్పేముందన్నట్టుగా మాట్లాడతారు. అయితే ఇలాంటి వారే పార్కుల్లో వెళ్లి ముద్దుముచ్చట్లు తీర్చుకునే సామాన్య జనాలను మాత్రం నైతిక విలువల్లేవని అంటారు. పార్కుల్లోకి వెళ్లడానికే మనసొప్పదని అక్కడంతా పాడుపనులే అని అంటారు. సినిమా వాళ్లు చెబుతున్న ముచ్చట్లకు, చేస్తున్న చేష్టలకూ పార్కుల్లోని సామాన్యుల చేష్టలకూ ఏమాత్రం తేడాలేదు. అయితే ఒకరిది అనైతికం అవుతుంది, మరొకరిది నైతికం అవుతుంది. ఇదేం నైతికత?