ఆమె చాలా హాట్ గా ఉంటుంది. కానీ ఆమె హాట్ నెస్ ను క్యాష్ చేసుకునే సినిమాలు రాలేదు. కథల పరంగా తీసుకున్న నిర్ణయాలు, ఆ హీరోయిన్ కెరీర్ ను ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. గతేడాది 2 భారీ చిత్రాలు చేసినప్పటికీ అవి అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఆ తర్వాత మరో యంగ్ హీరోతో చేసిన సినిమా కూడా బెడిసికొట్టడంతో పూర్తిగా సినిమాలు తగ్గించేసింది ఆ బ్యూటీ.
ఇప్పుడామెను కెరీర్ కష్టాలతో పాటు వ్యక్తిగత సమస్యలు కూడా ఇబ్బంది పెడుతున్నాయి. కేవలం ఈ వ్యక్తిగత సమస్యల కారణంగానే ఆమధ్య కొన్ని ఫంక్షన్లకు కూడా ఆమె హాజరుకాలేకపోయింది. అంతేకాదు, ప్రస్తుతం ఆమె ఎలాంటి కొత్త సినిమాలు ఒప్పుకోవడం లేదు. దీనికి కారణం అవకాశాలు రాక కాదు, కేవలం ఈ పర్సనల్ ఇష్యూస్ వల్లనే అని తెలుస్తోంది.
ఈ బ్యూటీకి అమెరికాతో పాటు సౌత్ ఇండియాలో అక్కడక్కడ ఆస్తులు ఉన్నాయి. ప్రస్తుతం ఆమె కుటుంబ సభ్యుల మధ్య ఈ ఆస్తి తగాదాలు నడుస్తున్నాయని సమాచారం. దీనికితోడు సినిమాలు వదిలేసి మరో ప్రొఫెషన్ చూసుకోవాలని, లేదంటే తొందరగా పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి కూడా వస్తోందట.
దీంతో ఆ హీరోయిన్ కెరీర్ ప్రస్తుతం డైలమాలో పడింది. ఒకరిద్దరు నిర్మాతలు ఆమెకు అవకాశాలివ్వడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఆమె ఎవరికీ అందుబాటులో ఉండడంలేదు. అమెరికాలో ఉంటుందా, ఇండియాలోనే ఉంటుందా అనే సమాచారం కూడా వాళ్లకు లభించడం లేదు. మరీ ముఖ్యంగా ఆమె హైదరాబాద్ లో ఉండడంలేదు. చూస్తుంటే.. ఆ హీరోయిన్ కెరీర్ అర్థాంతరంగా ముగిసేటట్టు ఉంది.