సినిమా కోసం డైరక్టర్ హరీష్ శంకర్ ఏడాదిన్నరగా ఎదురు చూసినకాలం మారింది. సినిమా చేతిలోకి వచ్చింది. అయితే రెండు మెయిన్ క్యారెక్టర్లు వుండడంతో కాస్టింగ్ సెట్ కావడంలేదు. వరుణ్ తేజ్ ఒక క్యారెక్టర్ కు సెట్ అయ్యాడు. రెండో క్యారెక్టర్ వుంది. తమిళంలో సిద్దార్ధ చేసిన క్యారెక్టర్. దానికి హీరో కావాలి.
ఇప్పుడు ఆ సమస్య కూడా తీరిపోయింది. శ్రీవిష్ణు దాదాపు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. పెద్దగా హిట్ లు ఖాతాలో లేవు. వరుణ్ తేజ్ కు కూడా పెద్దగా అభ్యంతరం వుండదు. తూకం సరిపోతుంది. అందుకే శ్రీవిష్ణును తీసుంటున్నట్లు తెలుస్తోంది.
14రీల్స్ ప్లస్ పతాకంపై తమిళ సినిమా జిగర్తాండ రీమేక్ కు హీరోల ఎంపిక టెన్షన్ తీరిపొతే, ఇక హీరోయిన్ వేట ప్రారంభించవచ్చు. అన్నీ అనుకున్నట్లు జరిగితే వరుణ్ తేజ్ అమెరికా వెళ్లి తిరిగి వచ్చాక, సినిమా షూటింగ్ స్పీడ్ అందుకుంటుంది.