కోలీవుడ్ లో హీరోయిన్లు చాలా ఈజీగా ప్రేమల్లో పడిపోతున్నట్టుగా ఉన్నారు. తమ సహచర హీరోలతో వీరి వ్యవహారాలు బాగానే నడుస్తున్నాయి. బ్రేకప్ లు జరుగుతూ ఉన్నాయి, కొన్ని పెళ్లిళ్ల వరకూ వెళ్తూ ఉన్నాయి. ఎలాగైతేనేం.. ప్రేమ వార్తలు అయితే కామన్. ఈ పరంపరలో సయేషా సైగల్ కూడా జాయిన్ అయ్యింది.
గత కొన్నాళ్లుగా ఈ హీరోయిన్ కి, తమిళనటుడు ఆర్యకు ప్రేమ వ్యవహారం నడుస్తోందనే ప్రచారం జరుగుతూ ఉంది. తెలుగులో హిట్టైన ‘భలే భలే మగాడివోయ్’ సినిమా తమిళ రీమేక్ లో వీళ్లిద్దరూ జంటగా నటించారు. ఆ సినిమా అక్కడ సరిగా ఆడలేదు కానీ.. వీళ్లిద్దరి జంటనూ కలిపింది.
తెలుగులో అఖిల్ తో సయేషా హీరోయిన్ గా పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బాలీవుడ్ సినిమా శివాయ్ లో నటించింది. తమిళనాట కార్తీ సరసన ఒక సినిమా చేసింది, ప్రస్తుతం సూర్యతో మరో సినిమా చేస్తోంది. ఇంకోవైపు ఆర్యతో ప్రేమాయణాన్ని నడిపిస్తోందనే ప్రచారాన్ని పొందుతూ ఉందీమె.
ఒకవైపు ఆర్య స్నేహితుడు విశాల్ పెళ్లికి రెడీ అవుతున్నాడు. ఈ హీరోలిద్దరూ పెళ్లి విషయంలో పోటీలు పెట్టుకున్నారనే మాట చాన్నాళ్లుగా వినిపిస్తోంది. విశాల్ పెళ్లి నేపథ్యంలో ఆర్య కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడని, సయేషాతోనే పెళ్లి అని ప్రచారం జరుగుతోంది. మరి ఈ కథ ఎంతవరకూ వెళ్తుందో చూడాలి!