Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

హాట్..హాట్..అక్టోబర్?

హాట్..హాట్..అక్టోబర్?

అక్టోబర్ అంటే దసరా ముసురు..ఎక్కడ చూసినా వర్షాలు..చల్లదనం. కానీ సినిమా థియేటర్లు మాత్రం వేడెక్కేలా వుంది పరిస్థితి. దసరా సీజన్ అంటే తెలుగు సినిమాలకు మాంచి టైమ్. అందుకే దాన్ని ఎయిమ్ చేసుకుని, చకచకా ముస్తాబు అవుతున్నాయి అరడజను సినిమాలు. శ్రీను వైట్ల-రామ్ చరణ్-రకుల్ ప్రీత్ సింగ్-దానయ్య కాంబినేషన్ సినిమా ఆది నుంచీ అక్టోబర్ నే ఎయిమ్ చేస్తోంది. రవితేజ బెంగాల్ టైగర్ కూడా అక్కోబర్ కు రెడీ కావాలని ప్రయత్నిస్తోంది. దీనికి సంపత్ నంది దర్శకుడు.

ఇప్పుడు అఖిల్-వివి వినాయక్ కాంబినేషన్ లోని సినిమా కూడా అక్టోబర్ రిలీజ్ అనే చూస్తోందట. ఆగస్టులో నాగ్ బర్త్ డేకు టీజర్ వదిలి ముందుకు వెళ్లాలని చూస్తొంది. ఇక క్రిష్-వరుణ్ తేజ సినిమా గాంధీ జయంతికి అంటే అక్టోబర్ రెండు కు ప్లాన్ చేస్తోంది. హరీష్ శంకర్ ఎవడే సుబ్రహ్మణ్యం కూడా రెడీ అవుతోంది.

నాని-మారుతి కాంబినేషన్ లోని భలే భలే మొగాడివోయ్..ఈ సీజన్ కు కాస్త ముందుగా వద్దామని చూస్తోంది. ఇవి కాక ఇంకా చాలా సినిమాలు సీరియస్ గా ప్రొడక్షన్ లో వున్నాయి. నాగ్, రామ్,కళ్యాణ్ రామ్ సినిమాలు వాటిలోవున్నాయి. మొత్తం మీద సెప్టెంబర్ నుంచి నవంబర్ నడుమ మాంచి హాట్ హాట్ సినిమాలు రానున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?