మొత్తానికి త్రివిక్రమ్ డిసైడ్ అయ్యాడు. తన తరువాతి సినిమాకు నితన్ హీరోగా ఫిక్స్ అయ్యాడు. గడచిన కొన్ని రోజులుగా దీనిపై ఊగిసలాట సాగుతోంది. నాగచైతన్యనా? నితిన్ నా? అని నటన పరంగా, క్రౌడ్ పుల్లింగ్ పరంగా నితిన్ బెటర్ చాయిస్ అన్నది అందరూ అంగీకరించేదే. అయితే కొన్ని కారణాల వల్ల త్రివిక్రమ్ నాగ చైతన్య పేరు కూడా పరిశీలనలోకి తీసుకున్నాడు.
అయితే ఇప్పడు అన్ని విధాలా నితిన్ బెటర్ చాయిస్ అని ఫిక్సయ్యాడని వినికిడి. దీనికి మొదటి కారణం..నిర్మాత రాధాకృష్ణ దగ్గర నాగచైతన్య డేట్స్, ప్రాజెక్టు, డైరక్టర్ రెడీగా వున్నారు. చందు మొండేటి స్క్రిప్ట్ తో రెడీగా వున్నారు. అలాంటిది అనుకోకుండా నితిన్ తో మరో ప్రాజెక్టు అడక్కుండా చేతిలోకి వస్తుంది.
పైగా నితిన్ మంచి ఆఫర్ కూడా ఇచ్చినట్లు టాలీవుడ్ బోగట్టా. నైజాం హక్కులు, శాటిలైట్ హక్కులు తానే ముందే తీసుకుంటానని, పైగా రెమ్యూనిరేషన్ రీజనబుల్ గా చేస్తానని మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. అంటే సినిమా క్లాప్ కొట్టకుండానే డబ్బులు వచ్చి చేతిలో పడతాయి. నాగ్ చైతన్య ప్రాజెక్టు అలాగే వుంటుంది. త్రివిక్రమ్ కూడా స్క్రిప్ట్ తయారీని దాదాపు నితిన్ కు అనుగుణంగానే తయారుచేసినట్లు తెలుస్తోంది.
ఈ వైనాలు అన్నీ తెలిసి, నాగచైతన్య ఒకటి రెండు రోజులకు ముందే దర్శకుడు చందు మొండేటిని పిలిచి తన ప్రాజెక్టు మీద గో అహెడ్ అని చెప్పినట్లు తెలిసింది. మొత్తానికి ఓ సమస్య తీరింది. నితిన్ నక్కతోక తొక్కాడు..త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నాడు. బెస్టాఫ్ లక్ నితిన్