ఎక్కడైనా సరే సక్సెస్ నే కొలమానం. టాలీవుడ్ కూడా అందుకు అతీతం ఏమీ కాదు. బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాల సక్సెస్ తో దర్శకుడు కమ్ నటుడు అవసరాల శ్రీనివాస్ ఇప్పుడు టాలీవుడ్ బిగ్గీస్ దృష్టిలో పడ్డారు. జ్యో అచ్యుతానంద విడుదలయిన మర్నాడు ఆయనకు ఆఫర్ల ఫోన్ లు కాస్త చెప్పుకోదగ్గ సంఖ్యలోనే వచ్చాయి.
ముఖ్యంగా సరైన మీడియం సినిమా తీయాలని అనుకుంటున్నా పెద్ద ప్రొడ్యూసర్లంతా అవసరాలకు ఫోన్ చేసారు. స్టార్ కాస్ట్ మీ ఇష్టం..సినిమా చేయండి అంటూ. అవసరాలకు సన్నిహితులైన నాని లాంటి హీరోలు ఫోన్ చేసి కంగ్రాట్స్ చేసారు. అవసరాల తన తరువాతి సినిమా కూడా వారాహి వారికే చేయాల్సి వుంది.
అయితే ఈ డిమాండ్ చూసాక, సాయి కొర్రపాటి కూడా అవసరాల రెమ్యూనిరేషన్ పెంచినట్లు తెలుస్తోంది. రెండు న్నర నుంచి మూడు కోట్ల మధ్యన రెమ్యూనిరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. సాయి కొర్రపాటి-అవసరాల కాంబినేషన్ లోని మూడో సినిమాలో నాని హీరోగా నటిస్తారు. కచ్చితంగా ఇది క్రేజీ ప్రాజెక్టు అవుతుంది. అందులో సందేహం లేదు.