ఖైదీ 150 ఓవర్ సీస్ హక్కులు ఇంకా అమ్మలేదా?

ఖైదీ 150 ఓవర్ సీస్ హక్కులు రికార్డు ధరలో 13.5 కోట్లకు అమ్ముడయ్యాయన్న వార్తలు ఒక్కసారి గుప్పుమన్నాయి. నాన్ బాహుబలి రికార్డు ఇదే అని అభిమానులు ఈ న్యూస్ ను తెగ షేర్ చేసుకున్నారు.…

ఖైదీ 150 ఓవర్ సీస్ హక్కులు రికార్డు ధరలో 13.5 కోట్లకు అమ్ముడయ్యాయన్న వార్తలు ఒక్కసారి గుప్పుమన్నాయి. నాన్ బాహుబలి రికార్డు ఇదే అని అభిమానులు ఈ న్యూస్ ను తెగ షేర్ చేసుకున్నారు. అయితే ఈ వార్త ఎక్కడ పుట్టిందో, ఎలా వ్యాపించిందో కానీ, ఇంకా డీల్ ఫైనల్ కాలేదని ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల బోగట్టా. 13.5 కోట్లు ఫిగర్ అన్నది నిర్మాత రామ్ చరణ్ అడుగుతున్న ఫిగర్ అని, అయితే ఇంకా ఇది బేరసారాల్లోనే వుందని అంటున్నారు. 

ఈలోగా మరి హైప్ పుట్టించడం కోసం ఫీలర్ వదిలారో, డీల్ ను పూర్తి క్లారిటీగా చెప్పడం లేదో కానీ, ఈ వార్తల మీద మాత్రం డవుట్ లు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ బ్రూస్ లీ అక్కడి బయ్యర్ కు ఆరు కోట్ల మేరకు నష్టం మిగిల్చింది. మాస్ సినిమాలకు ఓవర్ సీస్ మార్కెట్ అంతగా వుండదు. చిరు సినిమాకు వినాయక్ డైరక్టర్. 

పైగా ఆ సినిమాలో అయిటమ్ సాంగ్ లు, అవీ జోడించి కథను ఒరిజినల్ కు బాగా దూరంగా జరిపారన్న టాక్ వుంది. అలాంటి బ్యాక్ డ్రాప్ లో ఎంత 150వ సినిమా అని హైప్ వున్నా, ఇంత స్టేక్ ఆడడానికి బయ్యర్లు వెనుకాడతున్నట్లు తెలుస్తోంది.