హాట్..బ్రేకింగ్…రేర్ కాంబినేషన్ న్యూస్

ఇన్నాళ్లు వినిపించింది వేరు, ఇప్పుడు వినిపిస్తున్నది వేరు. ఇన్నాళ్లు అందరూ అనుకుంటున్నది వేరు. ఇప్పుడు జరగబోతుంది అని తెలుస్తున్నది వేరు. అవును..ఇప్పటి వరకు ఓ లెక్క. ఇప్పటి నుంచి మరో లెక్క. ఎందుకంటే సీన్…

ఇన్నాళ్లు వినిపించింది వేరు, ఇప్పుడు వినిపిస్తున్నది వేరు. ఇన్నాళ్లు అందరూ అనుకుంటున్నది వేరు. ఇప్పుడు జరగబోతుంది అని తెలుస్తున్నది వేరు. అవును..ఇప్పటి వరకు ఓ లెక్క. ఇప్పటి నుంచి మరో లెక్క. ఎందుకంటే సీన్ లోకి బాహుబలి ప్రభాస్ వచ్చాడు. 

ఎప్పటి నుంచో వినిపిస్తోంది కెజిఎఫ్ డైరక్టర్  ప్రశాంత్ నీల్ తెలుగు సినిమా చేస్తారు..మైత్రీ మూవీస్ కు అని. కానీ అప్పట్లోనే రాశాం..ప్రశాంత్ నీల్ కు కేజిఎఫ్ నిర్మాతలతో ఆబ్లిగేషన్ వుంది అని. ఇప్పుడు అదే నిజమైంది. కేజిఎఫ్ 2 తరువాత కూడా ప్రశాంత్ నీల్ మరో సినిమాను కేజిఎఫ్ నిర్మాతలకే చేయబోతున్నారు. 

హీరో మరెవరో కాదు, బాహుబలి ప్రభాస్. ఇప్పుడు ఈ కాంబినేషన్ ఫిక్సేషన్ మీద సీరియస్ గా చర్చలు సాగుతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే ప్రభాస్ ఈ సినిమా మీదకు డిసెంబర్ లేదా జనవరి నుంచి వెళ్తాడు అని తెలుస్తోంది. మరి నాగ్ అశ్విన్ సినిమా ఎప్పుడు? ఇది ముందుగా? అది ముందా? ఈ ప్రశ్నలు అన్నింటికీ సమాధానాలు త్వరలో తెలుస్తయి.