హోటల్ వ్యాపారంలోకి అనిల్ సుంకర

ఎకె ఎంటర్ టైన్మెంట్స్ అనిల్ సుంకర వేలు పెట్టని వ్యాపారం లేదేమో. సినిమా నిర్మాణాలు మాత్రమే కాకుండా, ట్రయినింగ్ ఇన్సిటిట్యూట్ లు, ఇంజనీరింగ్ కాలేజీ, సినిమా డిస్ట్రిబ్యూషన్, బీరు ఫ్యాక్టరీ, విదేశాలో మాల్, ఎఫ్…

ఎకె ఎంటర్ టైన్మెంట్స్ అనిల్ సుంకర వేలు పెట్టని వ్యాపారం లేదేమో. సినిమా నిర్మాణాలు మాత్రమే కాకుండా, ట్రయినింగ్ ఇన్సిటిట్యూట్ లు, ఇంజనీరింగ్ కాలేజీ, సినిమా డిస్ట్రిబ్యూషన్, బీరు ఫ్యాక్టరీ, విదేశాలో మాల్, ఎఫ్ ఎమ్ ఛానెల్ ఇలా ప్రతిదాంట్లో ఏదో ఒకటి చేస్తున్నారు. లేటెస్ట్ గా హోటల్ వ్యాపారంలోకి కూడా దిగుతున్నారు. 

ఇప్పటికే నాగార్జున, శర్వానంద్, సందీప్ కిషన్, నితిన్, ఇంకా చాలా అంటే చాలా మంది సినిమా జనాలు రెస్టారెంట్ల వ్యాపారంలో వున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో అనిల్ సుంకర పేరు కూడా చేరుతోంది.

సినిమా జనాలను రెస్టారెంట్ల వైపు ఆకర్షితులయ్యేలా చేసిన వెంకట్ కూచిపూడి, మరో ఎన్నారై భాగస్వామితో కలిసి సూర్యాపేట వద్ద విజయవాడ జాతీయ రహదారిపై 'రాజుగారి తోట' అనే డాబాను 1వ తేదీన స్టార్ట్ చేస్తున్నారు. ఎప్పుడో అనిల్ సుంకర అక్కడ కొన్న స్థలం ఇలా పనికి వచ్చినట్లుంది.

1న ఈ డాబా ఓపెనింగ్ సందర్భంగా అనేక మంది సినిమా సెలబ్రిటీలు ఛలో సూర్యాపేట అంటూ బయల్దేరుతున్నారు. ప్రస్తుతం అనిల్ సుంకర కిర్రాక్ పార్టీ, రాజుగాడు సినిమాలు నిర్మించి విడుదలకు సిద్ధంగా వుంచారు.