Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రాక్షసుడు, రమేష్ వర్మ.. తెరవెనక కథ

రాక్షసుడు, రమేష్ వర్మ.. తెరవెనక కథ

ఒక్క ఫ్లాప్ వస్తేనే దర్శకుల జాతకాలు తలకిందులవుతున్న రోజులివి. అలాంటిది ఐదేళ్ల కిందటే తెరమరుగైపోయిన దర్శకుడికి పిలిచి మరీ అవకాశం ఇస్తారా ఎవరైనా? రమేష్ వర్మ విషయంలో ఇలానే జరిగింది. అంతా మరిచిపోయిన ఈ దర్శకుడికి బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఛాన్స్ ఇవ్వడంతో అంతా ఆశ్చర్యపోయారు. చాలామంది అనుమానపడ్డారు కూడా. ఆ అనుమానాలే నిజమయ్యాయి.

నిజానికి రమేష్ వర్మ చేయాల్సిన సినిమా రాక్షసుడు కాదు. ఇతడో లవ్ సబ్జెక్ట్ తో బెల్లంకొండను కలిశాడు. ఇద్దరు హీరోయిన్లు, భారీ బడ్జెట్, లండన్ బ్యాక్ డ్రాప్ ఇలా ఉంది ఆ కథ వ్యవహారం. కథ విన్న వెంటనే నచ్చి వెంటనే ఓకే చెప్పేశారు. అంతేకాదు, తన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను గ్రాండ్ గా ప్రకటించాడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్.

కట్ చేస్తే, ఇండస్ట్రీలో అతడి వర్గీయులు కొంతమంది బెల్లంకొండకు బాగానే క్లాస్ పీకారు. రమేష్ వర్మతో సినిమా చేసి ప్రయోగాలు చేయొద్దని, ఇప్పటికే హిట్స్ లేక ఇబ్బంది పడుతున్న టైమ్ లో అతడితో సినిమా చేస్తే మార్కెట్ మరింత పడిపోతుందని హెచ్చరించారు. కానీ ఆల్రెడీ పుట్టినరోజు సందర్భంగా సినిమా ప్రకటించడంతో, తప్పనిసరి పరిస్థితుల్లో రాక్షసుడు రీమేక్ బాధ్యతల్ని అతడికి అప్పగించారట. ఎలాంటి ప్రయోగాలు చేయొద్దని, ఉన్నది ఉన్నట్టు కాపీ-పేస్ట్ చేయమని గట్టిగా చెప్పారట.

అలా రాక్షసుడు సినిమాను డైరక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు రమేష్ వర్మ. ఈ సినిమాకు ఎలాంటి మార్పులు చేయకపోవడానికి, ఉన్నది ఉన్నట్టు తీయడానికి కూడా కారణం కూడా రమేష్ వర్మే అంటున్నారు. కారణాలు ఏమైనప్పటికీ రమేష్ వర్మ మాత్రం రాక్షసుడు సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. కెరీర్ లో తొలిసారి రీమేక్ చేసిన ఈ దర్శకుడు కాపీ-పేస్ట్ చేయడం అంత ఈజీ కాదంటున్నాడు. నిజంగా రీమేక్ చేయడం అంత ఈజీ అయితే శంకర్, త్రీ-ఇడియట్స్ రీమేక్ తో ఎందుకు హిట్ కొట్టలేకపోయాడని ప్రశ్నిస్తున్నాడు. 

వారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రీ ఎంట్రీ..?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?