హరీష్ తో 14రీల్స్ తకరారు ఏమిటి?

డిజె సినిమా తరువాత బోలెడు గ్యాప్ వచ్చింది డైరక్టర్ హరీష్ శంకర్ కు. ఆఖరికి 14 రీల్స్ సంస్థలో ఏనాటిదో అయిన జిగర్తాండ రీమేక్ ప్రాజెక్ట్ సెట్ అయింది. బాగానే వెళ్తోంది బండి అనుకుంటే,…

డిజె సినిమా తరువాత బోలెడు గ్యాప్ వచ్చింది డైరక్టర్ హరీష్ శంకర్ కు. ఆఖరికి 14 రీల్స్ సంస్థలో ఏనాటిదో అయిన జిగర్తాండ రీమేక్ ప్రాజెక్ట్ సెట్ అయింది. బాగానే వెళ్తోంది బండి అనుకుంటే, నిర్మాతలకు-డైరక్టర్ కు మధ్య పొరపొచ్చాలు వచ్చాయన్న గ్యాసిప్ గుప్పుమంది. దీన్ని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు భాగస్వామి శిరీష్ వెళ్లి సెట్ చేసి వచ్చినట్లు తెలుస్తోంది.

విషయం ఏమిటంటే… ఈ సినిమాను ప్రాఫిట్ షేరింగ్ మీద, రెమ్యూనిరేషన్ లేకుండా చేస్తున్నారు దర్శకుడు హరీష్ శంకర్. సినిమా విడుదల మరో నెలరోజుల్లో వుంది. సెప్టెంబర్ లో విడుదల. మార్కెటింగ్ స్టార్ట్ చేయాలి. ఇక్కడే ఏదో తేడా వచ్చినట్లు తెలుస్తోంది. తన సినిమాకు ఈ రేంజ్ రేట్లు వస్తాయని హరీష్, అబ్బే అంతరావు, అన్నట్లుగా 14 రీల్స్ జనాలు కిందామీదా అయ్యారు.

తనకు తక్కువ చెబుతున్నారేమో అని హరీష్ అనుమాన పడుతున్నారని బోగట్టా. దీంతో కావాలంటే రెమ్యూనిరేషన్ తీసేసుకోండి, తాము సినిమాను డైరక్ట్ రిలీజ్ చేసుకుంటాం అని 14 రీల్స్ బాధ్యులు చెప్పినట్లు తెలుస్తోంది. ఆఖరికి మార్కెటింగ్ లో అనుభవం వున్న శిరీష్ ను పిలిపించి, సర్దుబాటు చేసుకున్నారని బోగట్టా.

ఓ రేంజ్ రేట్లు ఫిక్స్ చేసి, ఆ రేంజ్ లోనే అమ్మి, లాభాలు షేర్ చేసుకునేలా సర్దుబాటు జరిగినట్లు తెలుస్తోంది.

వారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రీ ఎంట్రీ..?