ఐ… దీపావళికి రానట్లే

  Advertisement మెగా డైరక్టర్ శంకర్, విలక్షణ నటుడు విక్రమ్ ల కాంబినేషన లో, 180 కోట్ల భారీ బడ్జెట్ తో తయారవుతున్న సినిమా ఐ. ట్రయిలర్లు విడుదలైన ఇప్పటికే సంచలనం సృష్టిస్తున్నాయి.ఈ సినిమా…

 

మెగా డైరక్టర్ శంకర్, విలక్షణ నటుడు విక్రమ్ ల కాంబినేషన లో, 180 కోట్ల భారీ బడ్జెట్ తో తయారవుతున్న సినిమా ఐ. ట్రయిలర్లు విడుదలైన ఇప్పటికే సంచలనం సృష్టిస్తున్నాయి.ఈ సినిమా దీపావళికి విడుదలవుతుందని అనుకున్నారు. కానీ ఇంకా గ్రాఫిక్స్, ఇంతర సాంకేతిక పనులు బాకీ వున్నాయి. తెలుగునాట అడియో ఫంక్షన్ జరగాల్సి వుంది. 

అందువల్ల దీపావళికి వస్తుందా రాదా అన్న అనుమానాలు తలెత్తాయి. ఇప్పుడు మరింత జాప్యం అనివార్యమయ్యేలా తమిళ రాజకీయాలు మారాయి. జయలలిత జైలులో వున్నారు. తమిళనాట నటులు, డిస్ట్రిబ్యూటర్లు, నిరసన చేపట్టారు. ఇవన్నీ కొలిక్కి రావాలి. అప్పుడు కానీ ఐ వ్యవహారాలు, తమిళ రాజకీయాలు సర్దుకుంటే తప్ప ఐ విడదల కాకపోవచ్చు