ఇదెక్కడి బాధ.. ఆలోచించండి

ఈ మధ్య సినిమా పాటలు, మాటలు, ఇతరత్రా వ్యవహారాలకు మనోభావాలు దెబ్బతినడం కామన్ అయిపోయింది. అయితే ఇలాంటి వాటిలో సీరియస్ వ్యవహారాలు వుంటాయి. సిల్లీ సంగతులు వుంటాయి. రంగస్థలం విషయంలో ఇప్పడు అలాంటి సిల్లీ…

ఈ మధ్య సినిమా పాటలు, మాటలు, ఇతరత్రా వ్యవహారాలకు మనోభావాలు దెబ్బతినడం కామన్ అయిపోయింది. అయితే ఇలాంటి వాటిలో సీరియస్ వ్యవహారాలు వుంటాయి. సిల్లీ సంగతులు వుంటాయి. రంగస్థలం విషయంలో ఇప్పడు అలాంటి సిల్లీ వివాదమే బయటకు వస్తోంది.

ఆ సినిమాలోని రంగమ్మా.. మంగమ్మా పాటలో తమకు అభ్యంతర పదాలున్నాయి అంటున్నారట యాదవ కులానికి చెందినవారు. గొల్లభామ వచ్చి గోరు గిల్లుతుంటే.. అన్నపదం తమ మహిళలను కించపర్చడం అన్నది వాళ్ల వాదనగా వుందన్నది వార్తల సారాశం.

నిజానికి గొల్లభామ అంటే కేవలం యాదవ మహిళ మాత్రమే కాదు, పాట ప్రకారం ఆకుపచ్చగా వుండే అందమైన కీటకం. పోనీ సినిమాలో హీరో నన్ను గొల్లభామ వచ్చి గిల్లుతోంది అని పాడి వుంటే, అక్కడ డబుల్ మీనింగ్ వుందని వాదించవచ్చు. మనోభావాలు దెబ్బతినవచ్చు.

హీరోయిన్ తన గోరు గొల్లభామ గిచ్చిందని అన్నా, హీరో పట్టించుకోలేదు అంటూ పాడుతోంది. ఓ అమ్మాయి గోరు ఇంకో అమ్మాయి గిల్లడం కాదు కదా? అక్కడ. ఏ విధంగా చూసుకున్నా అలాంటి మీనింగ్ రాదు కదా?

కాస్త ఆలోచించాలి. నిజంగా మనోభావాలు దెబ్బ తీసేవారిని నిలదీయాలి. కాస్త అటు ఇటు కాని వాటిని డిస్కస్ చేయాలి. ఏమాత్రం అనిపించని వాటిని వదిలేయాలి.